న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణకేసులో దోషిగా తేలిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టు రూ. 1 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రశాంత్ భూషణ్.. గత జూన్ 27, 29 తేదీల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వివాదాస్పద ట్వీట్లు పెట్టారు. ఈ ట్వీట్లను ఎస్ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. ఆయనపై ‘ధిక్కార మరియు పరువు నష్టం’ కేసులు నమోదు చేసి విచారించింది. ఈ కేసుపై విచారించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. సోమవారం తీర్పును వెలువరించింది.
విజయం ఎప్పుడూ వెంటనే వరించదు. తన కోసం తపించే వారి మనసును పరీక్షిస్తుంది. అడ్డంకులను సృష్టించి, కష్టాలను కలిగిస్తుంది. అవకాశాలను చేజారుస్తుంది. వాటన్నింటినీ తట్టుకుని, కష్టాల కన్నీటిని అదిమిపట్టి, ఎంత కష్టమొచ్చినా ఎదిరించి నిలిచిన వారికే అది వరమవుతుంది. 14 ఏళ్ల వయస్సులో బడిలో ఉండాల్సిన అమ్మాయి పెళ్లి పీటల మీద కూర్చుంది. 23 ఏళ్లకే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఏదైనా ఉద్యోగం చేయాలనే తండ్రి కలను నెరవేర్చింది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంచెలంచెలుగా […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 1036 గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండి.. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా, అభ్యర్థులు త్వరగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పోస్టులు 1,036 (నెల్లూరు 273, చిత్తూరు 374, శ్రీకాకుళం 85, తూర్పు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(24 గంటల్లో) 1,873 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,24,963 కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 9 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 827కు చేరింది. వ్యాధి బారినపడి నిన్న ఒకరోజే 1,849 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 92,837 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31,299 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 76.55 […]