సారథి న్యూస్, పెద్దశంకరంపేట: తొలి రోజు పాఠశాలకు వెళ్లిన ఒక ప్రభుత్వ టీచర్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మెదక్‌జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో శంకర్‌నాయక్ ఎస్జీటీగా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులందరూ 27 నుంచి పాఠశాలలకు రావాలని ఆదేశించడంతో.. గురువారం ఉదయం స్కూలుకు బయలుదేరి వెళ్లాడు. ఈ క్రమంలో కాలినడకన పాఠశాలకు వెళ్తుండగా.. వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శంకర్‌నాయక్ ఎడమకాలు ఛిద్రమైంది. తీవ్రంగా రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు ఆయనను 108 […]
సారథి న్యూస్, ఖమ్మం: ఆదివాసీలకు ఎల్లప్పుడూ అండగా ఉండి, వారి హక్కులను పరిరక్షిస్తామని భారత మానవహక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తురకలగూడెం గ్రామంలో గురువారం మానవహక్కుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా గిరిజనలకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం వారి ఇండ్లను పరిశీలించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల బాగోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు గిరిజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి ఓ సర్పంచ్‌ను బలితీసుకుంది. తమతో కలిసి తిరిగిన వ్యక్తి.. తమ బాగోగులు పట్టించుకున్న నేత ఇక లేడన్న వార్త ఆ ఊర్లో విషాదం నింపింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పందికుంటపల్లి సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కటకం రవీందర్ గురువారం కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా సోకింది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రవీందర్ ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామంలో ఎన్నో […]
సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: కరోన తీవ్రత కొనసాగుతోంది. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పీహెచ్సీలో గురువారం 28 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని వైద్యఅధికారులు సూచిస్తున్నారు. కొంతమంది అజాగ్రత్త వల్ల మిగతావారు ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పారు.
ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు, యూనిట్లు ఏర్పాటుకు ప్రోత్సాహం కూలీల సంక్షోభం పోవాలి.. యాంత్రీకరణ పెరగాలి నాబార్డ్ చైర్మన్, అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు సూచించారు. వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, నాబార్డు లాంటి సంస్థలు ప్రత్యేక ప్రణాళికలు అమలుచేయాలని కోరారు. నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను […]
కథ మాదేనంటూ వచ్చేస్తారు కొంతమంది. అదే స్టార్ హీరోల విషయమైతే మరింత రచ్చ చేయాలని చూస్తారు. రీసెంట్ గా చిరంజీవి సినిమా సైతం ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొవాల్సి వచ్చింది. చిరంజీవి, కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా చిరు బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. విడుదలైన కొద్దిసేపటికే కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత.. ఆచార్య మోషన్ పోస్టర్ […]
ఫామ్ లో ఉండగానే కొంతమంది హీరో హీరోయిన్లు రకరకాల బిజినెస్‌లు చేస్తున్నారు. అయితే అవకాశాలు తగ్గి బెలూన్ల బిజినెస్ మొదలెట్టిందన్న రూమర్ తో అగ్గి మీద గుగ్గిలం అవుతోంది స్టార్బ్యూటీ హన్సిక. తెలుగు, తమిళ చాలా చిత్రాల్లో నటించింది. ఒకటి రెండు లేడీ ఒరియెంటెడ్ మూవీలు కూడా చేసింది. చివరగా తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బీఏ బీయ్’ లో సందీప్ కిషన్ కు జోడీగా నటించినా ఆ సినిమాతో కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. హన్సికకు తెలుగులో ఆఫర్లు […]
నాటి రజాకార్ల రాచరిక పాలనకు వీరోచితంగా పోరాడిన వీర బైరాన్ పల్లి నెత్తుటి చరిత్రకు 72 ఏళ్లు నిండాయి. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన హైదారాబాద్ సంస్థానానికి నిజాం నవాబు కబంధహస్తాల్లోనే ఉండిపోయింది. రజాకార్లపై ప్రజలు, కమ్యూనిస్టులు చేస్తున్న తిరుగుబాటును అణిచివేయడానికి ఖాసీంరజ్వీ మిలిటెంట్లను పంపించాడు. 1948 ఆగస్టు 27న నాటి ఓరుగల్లు(వరంగల్), జిల్లా ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం బైరాన్‌పల్లి గ్రామం రజాకార్ల నరమేధంలో 118 మంది వీరమరణం పొందారు. నిజాం […]