Breaking News

Day: August 23, 2020

దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు

దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు

సారథి న్యూస్, మెదక్: ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు అధికారులను ఆదేశించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా రోడ్ల పరిస్థితిపై హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ కోతకు గురయ్యాయన్నారు. ఆర్అండ్ బీ అధికారులు అప్రమత్తంగా ఉండి మరమ్మతు పనులు‌ చేపట్టాలని సూచించారు. యుద్ధప్రాతిపదికన, శాశ్వత ప్రాతిపదికన చేయాల్సిన పనులను గుర్తించాలన్నారు. జీవోనం.2 కింద మరమ్మతు పనులు‌ తక్షణమే చేపట్టాలని […]

Read More
వినాయకుడి ఉత్సవాల్లో ఎమ్మెల్యే

వినాయకుడి ఉత్సవాల్లో ఎమ్మెల్యే

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని స్థానిక కొత్తపేటలో ఏర్పాటుచేసిన వినాయక చవితి వేడుకల్లో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ పాల్గొన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లలోనే జరుపుకోవాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకున్న ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది పండగ కొంత బాధ కలిగిస్తున్నా రేపటి భవిష్యత్​ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదన్నారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్​సీపీ నాయకులు, నిర్వాహకులు ఉన్నారు.

Read More

చేపల వేట.. ఉపాధికి బాట

సారథిన్యూస్, రామడుగు: చేపల వేట ప్రస్తుతం కొందరు యువకులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలతో కరీంనగర్​ జిల్లా రామడగు మండలంలోని వివిధ గ్రామాల్లోని వాగులు, చెరువులు అలుగు పారుతున్నాయి. లక్ష్మీపూర్ పంపు హౌస్ గ్రావిటీ కెనాల్ గేట్లు ఎత్తటంతో, చేపల వేట జోరుగా కొనసాగుతుంది. ప్రతి రోజు 50 నుండి 100 మంది యువకులు ఇక్కడ చేపలు పడుతున్నారు. తెల్ల చేపలు. అర్జులు, బొచ్చెలు, రవ్వులు, గురిజెలు, జెల్లలు, బొమ్మెలు తదితర చేపలు వారికి […]

Read More

పండగ సందడే లేదు

సారథి న్యూస్, రామడుగు: వినాయక చవితి అంటే.. డీజేలు, పూజలు, డప్పుచప్పుల్లు, భజనలతో మారుమోగిది. కానీ కరోనా కోరలు చాస్తున్న ప్రస్తుత తరుణంలో పండగ సందడి పూర్తిగా తగ్గిపోయింది. చాలా చోట్ల వీధుల్లో విగ్రహాలను ప్రతిష్ఠించనేలేదు. కొన్ని గ్రామాల్లో ప్రతిష్ఠించినా.. మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ప్రతి సారి 15 నుంచి 20 విగ్రహాలను ప్రతిష్టించేవారు. కానీ ఈ సారి మాత్రం నిశ్శబ్ధం అలుముకున్నది. ప్రజలు తమ ఇండ్లల్లోనే విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నారు.

Read More

అంత:పుర కాంతగా పూజాహెగ్డే!

జిల్​ ఫేమ్​ రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్​ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పూజాహెగ్డే రాకుమారి పాత్ర పోషిస్తున్నట్టు ఫిలింనగర్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాధేశ్యామ్​ చారిత్రకమా.. లేక సోషియోఫాంటసీ చిత్రమా అన్నవిషయంపై క్లారిటీ లేదు. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ ను త్వరలోనే మొదలుపెట్టాలని భావిస్తున్నది చిత్ర యూనిట్​. లాక్​డౌన్​కు ముందు జార్జియాలో కొంతభాగం చిత్రీకరించారు. అయితే కరోనాతో అక్కడ షూటింగ్​ నిలిపివేశారు. […]

Read More
పోలీసు కుటుంబాలకు చేయూత

పోలీసు కుటుంబాలకు చేయూత

సారథి న్యూస్​, కర్నూలు: విధి నిర్వహణలో కరోనా బారినపడి మృతిచెందిన ఏడుగురు పోలీస్​ కానిస్టేబుల్​ కుటుంబాలకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఉత్తర్వుల మేరకు జిల్లా పోలీసు ఆఫీసులో ఏవో సురేష్ బాబు కార్పస్ ఫండ్, విడో ఫండ్, ఫ్లాగ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఒక్కొక్కరికి కార్పస్ ఫండ్ రూ.లక్ష, విడో ఫండ్ రూ.50వేలు, ఫ్లాగ్ ఫండ్ రూ.25వేల విలువైన చెక్కులను అందజేశారు. ఎంసీ మద్దిలేటి(నందవరం పీఎస్​), ఎంపీ పుల్లారెడ్డి(నంద్యాల 3 టౌన్ పీఎస్), ఎస్ఏ మాలిక్(కర్నూలు […]

Read More
ప్రజలను ఆదుకోండి: సీపీఎం

ప్రజలను ఆదుకోండి: సీపీఎం

సారథి న్యూస్, కర్నూలు: కరోనా ప్రబలుతున్న సమయంలో ప్రజలను ఆదుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్​ చేశారు. దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా ఆదివారం కర్నూలు నగరంలోని ముజఫర్ నగర్, ఇందిరాగాంధీ నగర్, వీకర్ సెక్షన్ కాలనీ, బాలగంగాధర్ తిలక్ నగర్, కల్లూరు, కృష్ణానగర్, షరీన్ నగర్, సీ క్యాంప్ సెంటర్, సోమిశెట్టి నగర్, బీటీఆర్ నగర్, మమతానగర్, అశోక్ నగర్, బళ్లారి చౌరస్తా, కొత్త బస్టాండ్ కూడళ్లలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి కుటుంబానికి రూ.7,500 ఆరునెలలపాటు ఇవ్వాలని, […]

Read More
ప్రకాశం పంతులు జీవితం ఆదర్శం

ప్రకాశం పంతులు జీవితం ఆదర్శం

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ జి.వీరపాండియన్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్​సమావేశ మందిరంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ జి.వీరపాండియన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, జేసీ3(సంక్షేమం) సయ్యద్ ఖాజామోహిద్దీన్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ.. తమిళనాడు, సమైక్యాంధ్ర రాష్ట్రాలకు తొలి సీఎంగా ఎన్నికై […]

Read More