సారథిన్యూస్, రామగుండం: తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కరోనా పేషంట్లకు సరైన వైద్యం అందడం లేదని వారు విమర్శించారు. శుక్రవారం పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంల్ న్యూడెమోక్రసీ, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో కేవలం 88 మంది వైద్యసిబ్బంది మాత్రమే ఉన్నారని.. దీంతో రోగులకు సరైన వైద్యం అందించలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా […]
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులు, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ లాంటి మాస్టర్ కోర్సులతో పాటు పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చని కోరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లలో దరఖాస్తుచేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు http://braou.ac.in/ లేదా https://www.braouonline.in/ వెబ్‌సైట్లలో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి 2020 సెప్టెంబర్ […]
శ్రీశైలం పవర్‌హౌస్ ఘటన చాలా దురదృష్టకరం బాధిత కుటుంబాలకు అన్నివిధాలుగా సాయం విచారం వ్యక్తంచేసిన విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సారథి న్యూస్, అచ్చంపేట: శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన సంఘటన దురదృష్టకరమైందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సంఘటన జరిగిన వెంటనే అర్ధరాత్రి బయలుదేరి సంఘటన స్థలికి 2.30 గంటలకు చేరుకున్నా ఉద్యోగులను దక్కించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం జెన్‌కో పవర్‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన జెన్‌కో ఉద్యోగుల పార్థివదేహాలను […]
సారథి న్యూస్, కర్నూలు: దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ 76 జయంతి వేడుకలను కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించారు. సీ క్యాంపు సెంటర్లో రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పుల్లారెడ్డి కాలేజీ వద్ద ఉన్న అనాథ బాలబాలికలకు పండ్లు, బ్రెడ్డు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవానికి రూపకల్పన చేశారని కొనియాడారు. నేడు సెల్ ఫోన్ వినియోగం ప్రతి ఒక్కరికి […]
శ్రీశైలం పవర్ హౌస్ మంటల్లో చిక్కుకుని మృత్యువాత తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశాలు సారథి న్యూస్, అచ్చంపేట: ఎటుచూసినా చిమ్మ చీకటి.. చుట్టూ దట్టమైన పొగలు.. ఎక్కడ చిక్కిన వారంతా అక్కడే ప్రాణాలు విడిచారు. తెలంగాణ పరిధిలోని పాతాళగంగ శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 9మంది దుర్మరణం పాలయ్యారు. ఒకరు డీఈ, నలుగురు ఏఈ స్థాయి అధికారులు ఉన్నారు. మిగతావారు సిబ్బంది ఉన్నారు. జెన్‌కో మొదటి యూనిట్‌లోని […]
నాగార్జునసాగర్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో శుక్రవారం మధ్యాహ్నం నాగార్జునసాగర్ 4 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 3.45 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 585 అడుగుల మేర ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతం 271.37 టీఎంసీల నిల్వ ఉంది.
575 అడుగులకు చేరిన నీటిమట్టం నేడు సాగర్ గేట్లు ఎత్తివేసే అవకాశం నాగార్జునసాగర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి వరద ఉధృతి పెరగడంతో నాగార్జునసాగర్ తొణికిసలాడుతోంది. శ్రీశైలం జలాశయం 10గేట్లు ఎత్తివేసి దిగువకు 3.45 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం సాయంత్రం నాగార్జునసాగర్ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 575.70 అడుగుల వద్ద ఉంది. 585 అడుగులకు చేరితే గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి. సాగర్ […]
శ్రీశైలం ఎడమగట్టు పవర్‌హౌస్ ప్రమాదంపై దిగ్భ్రాంతి సహాయ సహకారాలు అందించాలని అధికారులకు ఆదేశాలు సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శ్రీశైలం పర్యటనను రద్దుచేసుకున్నట్లు సీఎంవో అధికారులు వెల్లడించారు. వరుసగా రెండవ ఏడాది శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీశైలం వెళ్లాల్సి […]