కల్లూరు అర్బన్: కర్నూలు జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ఐటీఐ కాలేజీల్లో 2020- 21 సంవత్సరానికి చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ నాయకల్లు సోలోమన్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. దరఖాస్తు వెల రూ.10 మాత్రమే ఉంటుందని, పూర్తిచేసిన ఫారాలను ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కన్వీనర్/ప్రిన్సిపాల్ ప్రభుత్వ ఐటీఐ(బాలికలు), బి.తాండ్రపాడు, కర్నూలు చిరునామాకు పంపించాలని కోరారు.
సారథి న్యూస్, కర్నూలు: ఎగువ నుంచి భారీవరద రావడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. బుధవారం సాయంత్రం 195.7599 టీఎంసీల నీటి సామర్థ్యం చేరుకోవడంతో దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం 215. 807 టీఎంసీలు. 885 అడుగులకు గాను 881 అడుగుల మేర నీటినిల్వ ఉంది. జూరాల రిజర్వాయర్, సుంకేసుల బ్యారేజీ నుంచి మొత్తం శ్రీశైలానికి 3.63 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. సాయంత్రం ఆరు గంటలకు శిల్పాచక్రపాణి రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు మూడుగేట్లను ఎత్తి […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా కలెక్టర్ హోం క్వారంటైన్ ను రద్దుచేయడమంటే ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లకు దోచిపెట్టడమేనని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పీఎస్ రాధాకృష్ణ ఆక్షేపించారు. హోం క్వారంటైన్ ను రద్దుచేస్తూ కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాజశేఖర్, టి.రాముడు, రామకృష్ణ, నాగరాజ్, సి.గోవింద్, గురుశేఖర్, సాయిబాబా, గోపాల్, […]
సారథి న్యూస్, రామడుగు: రైతన్నలు మార్కెటింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రామడుగు వ్యవసాయాధికారి యాస్మిన్ పేర్కొన్నారు. తాము పండించిన ఉత్పత్తులను తామే విక్రయించుకొనే స్థాయికి ఎదగాలని సూచించారు. రైతులంతా సమష్టిగా ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్‌లో ఉత్పత్తిదారుల సంఘంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యాస్మిన్ మాట్లాడారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాలు ఏర్పాటు చేసుకుంటే సమిష్టిగా లాభాలు పొందవచ్చని ఆమె సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, […]
సారథిన్యూస్, ఖమ్మం/ఏన్కూర్: వర్షాలతో సర్వస్వం కోల్పోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం భగవాన్ నాయక్ తండాలో పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, ఎస్ఎఫ్ఐ […]
సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్ చికిత్స పేరుతో అమాయక ప్రజల నుంచి డబ్బులు లాగుతున్న ఓ ఆర్ఎంపీని పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామం కొయిటాలవీధికి చెందిన డి.రంగన్న స్థానికంగా ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. కరోనా పేరుతో చికిత్స అందిస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి విచారణ చేశారు. కోయిలకుంట్ల వీఆర్వో రవిప్రసాద్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. సంబంధించి సదరు ఆర్ఎంపీపై క్రిమినల్కేసు పెట్టించి అరెస్ట్చేయించినట్లు కర్నూలు […]
శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు బుధవారం ఉదయం సాక్షి గణపతిస్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పలు ఫలోదకాలతోనూ హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో పూజలు చేశారు. తర్వాత స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించారు. వైదిక సంప్రదాయాల్లో గణపతి అభిషేకానికి ఎంతో విశిష్టత ఉంది. అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విద్యార్థుల్లో ఆలోచనా […]
సారథిన్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,742కరోనా కేసులు నమోదయ్యాయి. 86 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,003 కి చేరింది. మొత్తం 57,685 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 86,725గా ఉంది. ఇప్పటివరకు 2,26,372మంది కరోనా నుంచి కోలుకోగా.. 2,906 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ […]