Breaking News

Month: July 2020

ఔరా.. మధుసూదన్ ఖజానా

ఔరా.. మధుసూదన్ ఖజానా

అందరిలా సాధారణంగా జీవిస్తే అందులో ప్రత్యేకత ఏముంటుంది. భిన్నంగా ఏదైనా చేస్తేనే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు దక్కుతాయి. అంతకు మించి ఆత్మ సంతృప్తి దొరుకుంది. అచ్చం అలాగే ఆలోచించారు మెదక్ ​జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్​ మధుసూదన్. సారథి న్యూస్, మెదక్: సాధారణంగా టీచర్ల వద్ద పుస్తకాలు ఉంటాయి. కానీ ఆయన వద్ద మాత్రం దేశవిదేశాలకు చెందిన వందల ఏళ్ల నాటి స్టాంపులు, నాణేలు, కరెన్సీ నోట్లు ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల […]

Read More
‘పాలీసెట్‌’ అప్లికేషన్​గడువు పెంపు

‘పాలీసెట్‌’ అప్లికేషన్ ​గడువు పెంపు

హైదరాబాద్: తెలంగాణ పాలీసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును పెంచుతూ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్‌) నిర్ణయం తీసుకుంది. రూ.300 ఆలస్య రుసుముతో జులై 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని కార్యదర్శి యూవీఎస్‌ఎన్‌ మూర్తి వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Read More
ప్రగ్యా టాకూర్​ వివాదాస్పద వ్యాఖ్యలు

హనుమాన్​చాలిసా పఠిస్తే కరోనా రాదట

భోపాల్‌: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్​ చాలిసా పఠిస్తే కరోనా దరిచేరదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు శ‌నివారం ట్వీట్​ చేశారు. ‘క‌రోనాతో పోరాడేందుకు అంద‌రూ జూలై 25 నుంచి ఆగ‌స్టు 5 వ‌ర‌కు త‌ప్ప‌నిస‌రిగా రోజుకు ఐదు సార్లు హ‌నుమాన్ చాలీసా ప‌ఠించండి. ఆఖ‌రి రోజు ఇంట్లో దీపాల‌ను వెలిగించి రాముడికి హార‌తి ప‌ట్టండి. దేశ‌వ్యాప్తంగా ఉన్న హిందువులు హ‌నుమాన్ చాలీసాను ఒకే స్వ‌రంలో ప‌ఠిస్తే దానికి క‌చ్చితంగా […]

Read More
విజయ్​ సేతుపతితో స్వీటీ

విజయ్​సేతుపతితో స్వీటీ రొమాన్స్​

అందాల భామ అనుష్కశెట్టి (స్వీటీ).. విలక్షణ నటుడు విజయ్​ సేతుపతితో ఓ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. విజయ్​ సేతుపతి తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. కాగా దర్శకుడు ఏఎల్ విజయ్​ చెప్పిన ఓ కథ విజయ్​కు తెగ నచ్చేసిందట. దీంతో ఈ చిత్రానికి ఒప్పకున్నాడని సమాచారం. ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్​గా నటించబోతుందట. అనుష్క గెటప్​ ఈ చిత్రంలో చాలా కొత్తగా ఉండనున్నదని సమాచారం. చిరంజీవి సైరా మూవీ లో అద్భుతమైన పాత్రలో నటించి […]

Read More
విశాల్​కు కరోనా

తమిళ హీరో విశాల్​కు కరోనా

తమిళ హీరో, నిర్మాత విశాల్​కు, ఆయన తండ్రికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా విశాల్​ సోషల్​మీడియా ద్వారా వెల్లడించారు. విశాల్​కు కరోనా సోకిందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా విశాలే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. ‘ముందుగా మా నాన్న(జీకే రెడ్డి)కు కరోనా సోకింది. అతడికి నేను సేవలు చేశాను. దీంతో నాకు లక్షణాలు కనిపించాయి. పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఆయుర్వేద మందులు వాడి నేను మా […]

Read More
జనజీవన స్రవంతిలో కలవండి

జనజీవన స్రవంతిలో కలవండి

సారథి న్యూస్, వాజేడు(ములుగు): మావోయిస్టులు వారోత్సవాల పేరుతో బంద్ లు చేయడం, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని, వారికి సహకరించినట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా ఓఎస్డీ సురేష్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో ఓవైపు కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మావోయిస్టులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పూనుకోవడంతో ప్రజల్లో వారిపట్ల వ్యతిరేకత పెరిగిందన్నారు. అడవుల్లో ఉండే గిరిజనులకు విద్య, వైద్యం, ఆర్థిక స్వావలంబన అందకుండా పురోగతికి మావోయిస్టులు అడ్డుపడుతున్నారని అన్నారు. గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడకుండా […]

Read More
కరోనా నియంత్రణలో విఫలం

కరోనా నియంత్రణలో విఫలం

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నియంత్రణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్.ఉత్తమ్​కుమార్​రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కరోనా కమ్యూనిటీ వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం కాంగ్రెస్​ నేతలు హైదరాబాద్​లోని ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ​ప్రభుత్వం ఆరేళ్లలో వారసత్వ కట్టడాల మరమ్మతులకు ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కొత్త భవనం నిర్మాణానికి ఉస్మానియా ఆస్పత్రి వెనుక ఆరెకరాల విస్తీర్ణంలో స్థలం […]

Read More
వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్ యూనిట్‌ ప్రారంభం

వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్ యూనిట్‌ ప్రారంభం

సారథి న్యూస్, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెళ్లి గ్రామంలో వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్ యూనిట్‌ను మంత్రులు కె.తారక రామారావు, సబితా ఇంద్రారెడ్డి శనివారం ప్రారంభించారు. ఇక్కడ ఫ్లోరింగ్ సొల్యూషన్స్, కార్పెట్ టైల్స్, గ్రీన్స్(కృత్రిమ గడ్డి), బ్రాడ్‌లూమ్ తివాచీలు (వాల్ టు వాల్ కార్పెట్)లను తయారుచేసేందుకు యూనిట్​ సిద్ధమైంది. గుజరాత్‌కు చెందిన కంపెనీ తెలంగాణలో రూ.రెండువేల కోట్ల పెట్టుబడులు పెట్టడం శుభపరిణామమని మంత్రి కేటీఆర్​అన్నారు. ఈ పారిశ్రామిక క్లస్టర్‌లో మరో నాలుగు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా […]

Read More