Breaking News

Month: July 2020

ప్రజాధనం దుర్వినియోగం

సారథి న్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని లక్ష్మీనగర్​లో 2013లో ప్రభుత్వం నిర్మించిన షాపింగ్​ కాంప్లెక్స్​ నిరుపయోగంగా ఉందని.. దీంతో రూ. 7 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని సీపీఐ నేతలు ఆరోపించారు. ఆదివారం సీపీఐ నేతలు రామగుండంలో పర్యటించి ప్రభుత్వం నిర్మించిన షాపింగ్​ కాంప్లెక్స్​ను సందర్శించారు. సీపీఐ రామగుండం నగర కార్యదర్శి కనకరాజ్​ మాట్లాడుతూ.. కేవలం కాంట్రాక్టర్లను బతికించడానికే షాపింగ్​ కాంప్లెక్స్​ను నిర్మించారని ఆరోపించారు. ఈ దుకాణ సముదాయం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. […]

Read More

నారప్ప న్యూపోస్టర్​ అదిరింది

విక్టరీ వెంకటేశ్​ హీరోగా శ్రీకాంత్​ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ‘నారప్ప’ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఓ పోస్టర్​ యువతను తెగ ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్​ లుక్​ను విడుదల చేశారు. తమిళంలో విజయవంతమైన ‘అసురన్​’కు రీమేక్​గా ఈ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో ధనుష్​ నటించిన ఈ సినిమా అక్కడ భారీవిజయాన్ని సొంతం చేసుకున్నది. దళితుడి జీవితానికి సంబంధించిన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తమిళ మాతృకకు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. […]

Read More
తెలంగాణలో 1,590 కేసులు

తెలంగాణలో 1,590 కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గడం లేదు. ఆదివారం రాష్ట్రంలో 1,590 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,902కు చేరింది. ఇప్పటి వరకు 1,15,835 మందిని పరీక్షించారు. తాజాగా ఏడుగురు మృతిచెందారు. ఇప్పటి వరకు 295 మంది చనిపోయారు. జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 1277, మేడ్చల్​ జిల్లాలో 125, రంగారెడ్డి జిల్లాలో 82, సంగారెడ్డి జిల్లాలో 19, మహబూబ్​ నగర్​ జిల్లాలో 19, సూర్యాపేట జిల్లాలో 23, నల్లగొండ […]

Read More

రజకుల సమస్యలు పరిష్కరిస్తాం

సారథిన్యూస్​, రామగుండం: రజకుల సమస్యలను పరిష్కరిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని 9వ డివిజన్​లో దోబీఘాట్​ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులవృత్తులను నమ్ముకుని జీవించే రజకులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు. రూ. 5 లక్షల నిధులతో దోభీఘాట్ నిర్మిస్తున్నామన్నారు. అనంతరం 8వ డివిజన్​లోని తెలంగాణ అడ్వంచర్ అక్వాడ్ టూరిజం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ […]

Read More

చాక్లెట్​ ఆశచూపి..

సారథిన్యూస్​, నిజామాబాద్:​ చాక్లెట్​ ఆశచూపి ఓ వృద్ధుడు ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్​ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నారాయణ ( 55) అనే వ్యక్తి ఎనిమిదేళ్ల ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేశాడు. ఇద్దరు చిన్నారులకు గత 15 రోజులుగా చాక్లెట్ ఆశ చూయించి పాడుబడ్డ ఇంట్లో లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంట్లో చెప్తే చంపుతానని బెదిరించాడు. కడుపునొప్పి తాళలేక చిన్నారులు కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. దీంతో […]

Read More
మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే రవిశంకర్​

హరితతెలంగాణే లక్ష్యం

సారథి న్యూస్, గంగాధర: తెలంగాణ వ్యాప్తంగా పల్లెలన్నీ చెట్లతో కళకళలాడాలన్నదే సీఎం కేసీఆర్​ లక్ష్యమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్​లో ఆదివారం ఎక్సైజ్​శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే తాటి, ఈత, ఖర్జూర మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

బాధిత కుటుంబాలకు పరామర్శ

సారథి న్యూస్, వరంగల్: ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన గిరిజన బాలుర కుటుంబాలను ఆన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్​ పేర్కొన్నారు. ఆదివారం మహబూబాబాద్​ ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఆమె బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. శనివారం గోడతండాకు చెందిన గిరిజన పిల్లలు ఇస్లావత్​ లోకేశ్​, రాకేశ్​, జగన్​, దినేశ్​ ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరి కుటుంబాలను మంత్రి పరామర్శించారు. మంత్రి వెంట ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్​నాయక్​, మున్సిపల్ […]

Read More

అమెరికా అధ్యక్ష రేసులో హాలీవుడ్​ ర్యాపర్​

వాషింగ్టన్‌: తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు హాలీవుడ్ ర్యాప‌ర్‌‌ కాన్యే వెస్ట్ ప్ర‌క‌టించారు. కాన్యే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అభిమాని కావడం గమనార్హం. ‘నేను అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నా. దేవున్ని విశ్వసిస్తూ, మ‌న భ‌విష్య‌త్తును మ‌న‌మే నిర్మించుకుంటూ అమెరికా హామీల‌ను నెర‌వేర్చుకుందాం’ అని ట్విట్టర్​లో పేర్కొన్నారు. పోటీకి సంబంధించి క్యానే ఎన్నిక‌ల బ్యాలెట్‌కు ఏదైనా ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారా అనే విష‌యం తెలియరాలేదు. కాగా 2018లో ట్రంప్ ఎన్నిక త‌ర్వాత‌ వెస్ట్ త‌న […]

Read More