Breaking News

Month: July 2020

సకాలంలో పనులు పూర్తిచేయండి

సారథిన్యూస్​, వరంగల్ అర్బన్: వరంగల్​ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం చేపడుతున్న పనులను సకాలంలో పూర్తిచేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ అరవింద్​ కుమార్​ అధికారులను ఆదేశించారు. మంగళవారం వారు వరంగల్​లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతీ, కుడా […]

Read More
తగ్గని మాయదారి రోగం

తగ్గని మాయదారి రోగం

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా తగ్గడం లేదు. రాష్ట్రంలో మంగళవారం 1,879 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏడుగురు మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 313కు చేరింది. మొత్తంగా రాష్ట్రంలో 27,612 పాజిటివ్​ కేసులు నిర్ధారణ అయ్యాయి.1,28,438 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్​ఎంసీ పరిధిలో 1,422, రంగారెడ్డి జిల్లాలో 176 కేసులు, మేడ్చల్​ జిల్లాలో 94, కరీంనగర్​లో 32, నల్లగొండ 31, నిజామాబాద్​లో 19 చొప్పున పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. […]

Read More

తల్లిపాలే శ్రేయస్కరం

సారథిన్యూస్​, హుస్నాబాద్: అప్పడే పుట్టిన శిశువుకు తల్లిపాలే శ్రేయస్కరమని డీఎంహెచ్​వో మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆశకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈవో భాస్కర్, వైద్యాధికారులు మురళీకృష్ణ, సౌమ్య, శివయ్య, కనకయ్య, శ్రీనివాస్, వినీత్, రామ్మూర్తి, ప్రేమలత, సూపర్ వైజర్లు విజయ, ఎలగొండమ్మ, ఆశకార్యకర్తలు […]

Read More

ఉద్యోగం రాలేదని..

సారథిన్యూస్, రామడుగు: ఎన్ని సార్లు ప్రయత్నించినా ఉద్యోగం రావటం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన మడ్డి లచ్చయ్యకు ముగ్గురు కుమారులు, ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటంతో, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్న కుమారుడు పవన్​కల్యాణ్​ (23) ఇటీవల ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఉద్యోగం రాకపోవడంతో ఇంట్లోని దూలానికి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని […]

Read More

కరోనా కట్టడిలో ఫెయిల్​

సారథి న్యూస్​, వరంగల్​: కరోనాను అరికట్టడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని టీడీపీ వరంగల్​ పార్లమెంట్​ అధ్యక్షుడు చిటూరి అశోక్​ ఆరోపించారు. కరోనాను అరికట్డడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం హన్మకొండలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. కరోనా టెస్టులు చేయకుండా రాష్ట్రప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మాడగాని మనోహర్, కుసుమ శ్యాంసుందర్, మార్గం సారంగం, బర్ల యాకూబ్, గొల్లపల్లి ఈశ్వరాచారి, చిలువేరు […]

Read More

విస్తృతంగా అవెన్యూ ప్లాంటేషన్

మహబూబాబాద్​: మహబూబాబాద్​ జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్​ ను విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్​ వీపీ గౌతం ఆదేశించారు. మంగళవారం హరితహారం పల్లెప్రగతి పనులను పరిశీలించేందుకు కేసముద్రం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. కేసముద్రం పట్టణం, ఇనుగుర్తి, లాలూ తండా, తౌర్య తండాల్లో పర్యటించి హరితహారం తీరు తెన్నులను పరిశీలించారు. లాలూ తండాలోని 4 ఎకరాల్లో చేపట్టిన అటవీశాఖ నర్సరీని సందర్శించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాచందన, తహసీల్దార్ వెంకటరెడ్డి, ఎంపీడీవో రోజా రాణి తదితరులు […]

Read More
సీమ అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకోం

సీమ అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకోం

సారథి న్యూస్, కర్నూలు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏపీ, తెలంగాణగా విడిపోయినప్పుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏంచేశారని, హైదరాబాద్‌ మాత్రమే అభివృద్ధి చేసినందుకే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ అన్నారు. రాష్ట్రంలో అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాన్న లక్ష్యంతో పోరాడుతున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కనీస జ్ఞానం కూడా లేకపోయిందని ఘాటుగా విమర్శించారు. రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ […]

Read More
వ్యక్తిగత జాగ్రత్తలు ముఖ్యం

వ్యక్తిగత జాగ్రత్తలు ముఖ్యం

సారథి న్యూస్, కర్నూలు: నగరంలో కరోనా కట్టడి అహర్నిశలు ప్రతి కాలనీలో శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత జాగ్రత్తలు ఎంతో ముఖ్యమని కర్నూలు నగర పాలక కమిషనర్ డీకే బాలాజీ సూచించారు. మంగళవారం స్థానిక వెంకటరమణ కాలనీలో పారిశుద్ధ్య కార్మికులకు కరోనా వైరస్ వ్యాప్తి నుంచి రక్షణ కోసం బెంగళూర్ నుంచి తెప్పించిన ఫేస్ షీల్డ్ మాస్క్ కు అందజేశారు. కార్మికులు, సిబ్బందికి 2,250 ఫేస్ షీల్డ్ మాస్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు.

Read More