మానోపాడు: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పరిశుభ్రత ఎంతో ముఖ్యమని జోగుళాంబ గద్వాల డీఎంహెచ్‌వో చందునాయక్ పేర్కొన్నారు. గురువారం ఆయన మానోపాడు పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్సీ ఆవరణలో చెత్త పేరుకుపోయి ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. రోగులకు విధిగా శానిటైజర్ లను అందించడంతోపాటు కరోన మహమ్మారి పట్ల భయం తొలగించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సవిత, సూపరవైజర్లు చంద్రన్న, లలిత […]
ఆగస్టు 15 నుంచి వీడియో పాఠాలు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సబ్జెక్టు టీచర్లను అందుబాటులో ఉండేలా ప్లాన్ సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డిజిటల్ బోధనను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ప్రాథమిక తరగతులకు వర్క్ షీట్స్, అసైన్‌మెంట్స్ ఇవ్వడంతో పాటు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వీడియో పాఠాలను ప్రసారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే 900 పైచిలుకు డిజిటల్ పాఠాలను రూపొందించారు. వీటిని టీశాట్, దూరదర్శన్ యాదగిరి చానళ్ల […]
సారథి న్యూస్, హైదరాబాద్: పట్టణాల్లో తాగునీరు, పారిశుధ్యం తదితర కనీస అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కె.తారక రామారావు అధికారులకు సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన సమీక్షించారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు, జిల్లా కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, ఎన్ వీ రెడ్డి, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, […]
మహేశ్‌బాబు మేనల్లుడిగా కంటే విలక్షణమైన హీరోగానే గుర్తింపు తెచ్చుకోడానికి ఇష్టపడే సుధీర్ బాబు లేటెస్ట్గా ఓ సినిమాకి కమిట్మెంట్ఇచ్చాడట. అదీ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన విజయ్ చిల్లా ప్రొడక్షన్లో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు సుధీర్ బాబు. ‘ప్రేమ కథా చిత్రమ్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, భలే మంచి రోజు, భాగీ, శమంతకమణి, సమ్మోహనం’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం సుధీర్ బాబు.. నానితో కలిసి నటించిన ‘వి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ […]
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై అనూహ్య విజయాన్ని అందుకుంది ‘అల వైకుంఠపురములో’ చిత్రం. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’కి ఒక నిర్మాతగా ఉన్న అశ్విన్ వార్దే ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారని సమాచారం. భారీ అంచనాలతో రూపొందబోయే ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరో అనుకుంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ రీమేక్ ను […]
హైదరాబాద్: ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలని డాక్టర్ శశికళ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. బక్రీద్ సందర్భంగా జంతు వధ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అక్రమంగా జంతు వధ చేస్తే చర్యలు తీసుకోవాలని తెలిపింది. చైనాలో గబ్బిలాలు తినడం ద్వారా కరోనా వచ్చిందన్న ప్రచారం ఉందని పేర్కొంది. మాంసం దుకాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు ఎప్పుడైనా తనిఖీ చేశారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జంతువధ […]
సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రి కేటీఆర్.. తన జన్మదినం సందర్భంగా ప్రభుత్వానికి ఆరు కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్‌లను అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంబులెన్స్‌లను గురువారం హైదరాబాద్‌లో ప్రగతి భవన్లో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. కాగా మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు వందకు పైగా అంబులెన్స్‌లు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. త్వరలోనే వాటిని కూడా ప్రారంభిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా విపత్తు నేపథ్యంలో కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్‌లు […]
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సూసైడ్ ఘటనను మరువకముందే.. మరో యువ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరాఠీ యువ నటుడు అశుతోష్ భక్రే (32) గురువారం నాంధేడ్లోని తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతని మృతికి గల కారణాలు తెలియరాలేదు. 2016లో ఆయన టీవీ నటి మయూరీ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా పలు మరాఠా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరినీ చిత్రపరిశ్రమ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా అభివర్ణించేవారు. ఈ ఘటనపై […]