Breaking News

Day: July 24, 2020

కొల్చారంలో కుండపోత

కొల్చారంలో కుండపోత

సారథి న్యూస్​, మెదక్​: మెదక్ జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీవర్షం కురుస్తోంది. కొల్చారంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆయా మండలాల్లో చాలా చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో భారీవర్షం కురవడంతో కొల్చారం, మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల పరిధిలోని మహబూబ్ నహర్ కాల్వ నిండుగా ప్రవహిస్తోంది. భారీవర్షాలు కురిసి చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకోవడంతో రైతులు, కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More
కరోనా బాధితులను జాగ్రత్తగా చూసుకోవాలి

కరోనా బాధితులను జాగ్రత్తగా చూసుకోవాలి

సారథి న్యూస్, కర్నూలు: కరోనా పాజిటివ్ వచ్చి లక్షణాలు లేని వ్యక్తులు ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకునేలా ప్రోత్సహించాలని వైద్యాధికారులకు కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సూచించారు. గురువారం స్థానిక కర్నూలు మెడికల్ కాలేజీ సమావేశ మందిరంలో కరోనా కట్టడి చర్యలపై వైద్యాధికారులతో జాయింట్ కలెక్టర్ రవి పట్టన్ షెట్టి, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్, జీజీహెచ్ సూపరిడెంటెంట్​డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డితో కలిసి సమీక్షించారు. కరోన బాధితులను హోమ్ ఐసోలేషన్ లో ఉండేలా […]

Read More
ఎస్పీని కలిసిన ఏఎస్సైలు

ఎస్పీని కలిసిన ఏఎస్సైలు

సారథి న్యూస్, కర్నూలు: అనంతపురం జిల్లాకు చెందిన 8 మంది ఏఎస్సైలు ఎస్సైలుగా పదోన్నతి పొందిన సందర్భంగా వారిని విధుల కోసం కర్నూలు జిల్లాకు కేటాయించారు. గురువారం వారు జిల్లా ఎస్పీ ఆఫీసులో ఎస్పీ డాక్టర్ కాగినెల్లి ఫక్కీరప్పను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. మరిన్ని పదోన్నతులు పొందాలని ఎస్పీ ఆకాంక్షించారు. కరోనా సమయంలో ప్రజలకు మంచి సేవలు అందించి పోలీసుశాఖకు పేరు తీసుకురావాలని కోరారు.

Read More