Breaking News

Day: July 22, 2020

కరోనా వ్యాక్సిన్ కోసం ఏ దేశంతోనైనా పనిచేస్తాం

కరోనా వ్యాక్సిన్ కోసం దేశంతోనైనా పనిచేస్తాం

వాషింగ్టన్‌: ప్రపంచంలో ఏ దేశమైనా కరోనా వ్యాక్సిన్​ను తయారుచేస్తే కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ స్పష్టంచేశారు. “ మాకు మంచి జరుగుతుంది అంటే కచ్చితంగా వారితో కలిసి పనిచేస్తాం” అని ట్రంప్‌ అన్నారు. చైనాతో కలిసి పనిచేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. వ్యాక్సిన్‌ను డెవలప్‌ చేసేందుకు అమెరికా కృషి చేస్తోందని అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనానే కారణమని ట్రంప్‌ మొదటి […]

Read More
పేదలకు ఇళ్లు కట్టివ్వడమే లక్ష్యం

పేదలకు ఇళ్లు కట్టివ్వడమే లక్ష్యం

సారథి న్యూస్​, కర్నూలు: ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్​ పార్థసారధి అన్నారు. 2021లో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టించాలనే ఉద్దేశంతో ప్రధాని ఏపీకి 11 లక్షల ఇళ్లు కేటాయించారని అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హయాంలో అనుచరులకు దోచిపెట్టారని అన్నారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో రూ.ఏడువేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. […]

Read More
సుప్రీం కోర్టుకు రాజస్థాన్​పంచాయితీ

సుప్రీం కోర్టుకు రాజస్థాన్​ పంచాయితీ

న్యూఢిల్లీ: పదిరోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్న రాజస్థాన్‌ రాజకీయం తాజాగా సుప్రీం కోర్టుకు చేరింది. 18 మంది రెబల్‌ ఎమ్మెల్యేల విషయంలో శుక్రవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్‌ అసెంబ్లీ స్పీకర్‌‌ సీపీ జోషి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. ‘నేను న్యాయమూర్తులను గౌరవిస్తాను. షో కాజ్‌ నోటీసు పంపే పూర్తి అధికారం స్పీకర్‌‌కు ఉంది. సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ పిటిషన్‌ వేయాలని మా లాయర్‌‌ను కోరాను. హైకోర్టు […]

Read More
సచిన్‌ పైలెట్‌ ఫైర్‌‌

సచిన్‌ పైలెట్‌ ఫైర్‌‌

జైపూర్‌‌: అశోక్‌ గెహ్లాట్‌ గవర్నమెంట్‌ను కూల్చేందుకు సచిన్‌పైలెట్‌ తమతో బేరాలు ఆడారని, డబ్బుల ఆశ చూపించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేలపై సచిన్‌పైలెట్‌ సీరియస్‌ అయ్యారు. అనవసరంగా తనపై ఆరోపణ చేయొద్దని, ప్రతి ఒక్కరూ రూ.ఫైన్‌ కట్టి తనకు క్షమాపణలు పంపాలని నోటీసులు ఇచ్చారు. తన రాజకీయ మైలేజ్‌ను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పైలెట్‌ ఆరోపించారు. గెహ్లాట్‌ గవర్నమెంట్‌ను కూల్చేందుకు పైలెట్‌ కుట్ర పన్నుతున్నారని, అందుకే సాక్ష్యమని ఎమ్మెల్యే మలింగ […]

Read More

మావోయిస్టులూ.. విధ్వంసం ఆపండి

సారథిన్యూస్​, కొత్తగూడెం: మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులను, గిరిజనలకు తీరని అన్యాయం చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ విమర్శించారు. జిల్లాలోని చర్ల మండలం బత్తినపల్లి, తిప్పాపురం గ్రామాల మధ్య ప్రభుత్వం రోడ్డును నిర్మిస్తుంటే మావోయిస్టులు రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న యంత్రాలను ధ్వంసం చేశారన్నారు. ఏజేన్సీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. మావోయిస్టులు ఇకనైనా ఈ విధ్వంసాన్ని ఆపాలని ఆయన సూచించారు.

Read More

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

సారథిన్యూస్​, ఓయూ: కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం ఓయూ అరణ్యప్రాంతంలోని ఓ రహస్యప్రాంతంలో అమరణ దీక్ష చేపట్టారు. వీరి దీక్షను అడ్డుకొనేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. ఓయూ పరిసరప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతావలయం ఏర్పాటుచేశారు. అయినప్పటికీ జేఏసీ నేతలు పోలీసుల కండ్లుగప్పి ఆందోళన నిర్వహించారు. ఓయూ జేఏసీ నేతల దీక్షకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్​ మానవతారాయ్​ సంఘీభావం తెలిపారు. దీక్ష […]

Read More

పాల్వంచలో కరోనా విజృంభణ

సారథి న్యూస్​, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కరోనా విజృంభిస్తున్నది, గత మూడురోజుల్లో 36 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా బుధవారం ఒక్కరోజు 12 మందికి కరోనా పరీక్షలు చేస్తే 12 మందికి పాజిటివ్​ వచ్చింది. దీంతో టెస్టులను మరింత పెంచితే కేసులు పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వచ్చిన రోగులను కాంటాక్ట్​లను గుర్తించే పనిలో […]

Read More

ముంపు బాధితులను ఆదుకుంటాం

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన ముంపు బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని నాగర్​కర్నూల్​ కలెక్టర్​ శర్మణ్​ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బిజినేపల్లి మండలం వట్టెంలో పర్యటించారు. అక్కడ ఆర్​ అండ్​ ఆర్​ కింద నిర్మిస్తున్న ఇండ్లను పరిశీలించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న రెండు తండాల ప్రజల కోసం వట్టెంలో 466 ఇండ్లను నిర్మిస్తున్నారు. ఈ ఇండ్లను ఆయన పరిశీలించారు. లేఅవుట్ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు […]

Read More