ఓ వైపు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం. మరోవైపు పార్టీ గుర్తింపుపై కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు, ఇంకోపక్క రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై హైకోర్టు వ్యాఖ్యలు. వీటితోనే జగన్ సర్కారు సతమతమవుతుంటే.. ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సీఎంవో మాజీ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీవీ రమేష్ వ్యాఖ్యలు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. శుక్రవారం ఆయన ట్వీట్ చేసిన అంశాలు ఏపీలోని రాజకీయ, అధికారవర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. […]
సావిత్రి ఫేమ్ నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వైజయంతి సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణే నటించనున్నది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విట్టర్లో తెలియజేశాడు. టాలీవుడ్లో దీపికా తొలిసారి నటిస్తున్నారు. ‘రాజు స్థాయికి సరిపోయే రాణిని తేవాలి కదా, అందుకే చాలా ఆలోచించి దీపికాను ఎంపికచేశాం. ఇక పిచ్చెక్కిద్దాం’ అంటూ నాగ్అశ్విన్ ట్వీట్ చేశారు. ఈ […]
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. మోదీ దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ చురుకుగా ఉంటూ రాజకీయ, పాలనాపరమైన విషయాలను ప్రజలతో పంచుకుంటారు. తాజాగా ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో 60 మిలియన్ల (6కోట్లు) ఫాలోవర్స్ మైలు రాయిని చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న రాజకీయ నాయకుల్లో మోదీ […]
జంషడ్‌పూర్: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని ఓ విద్యార్థిని నిరూపించింది. జార్ఘండ్ రాష్ట్రం జంషడ్పర్కు చెందిన నందితా హరిపాల్ సీబీఎస్ఈ 12 వతరగతిలో ని ఆర్ట్స్ విభాగంలో 83.8 శాతం మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. నందిత తండ్రి టైలర్‌గా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారి కుటుంబం పేదరికంలో మగ్గుతున్నది. కూతురు నందిత జంషడ్‌పూర్ ఉమెన్స్ కళాశాలలో విద్యనభ్యసించింది. ‘నేను టాపర్‌గా నిలుస్తానని కలలో కూడా ఊహించలేదు. ఫలితాలు చూసి నాతోపాటు కుటుంబసభ్యులు ఎంతో సంతోషించారు. నేను […]
జైపూర్: రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. సీఎం అశోక్ గెహ్లాట్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సచిన్ పైలట్‌కు అనుకూలంగా ఉన్న 19 మంది ఎమ్మెల్యేలపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసింది. మరోవైపు అశోక్‌గెహ్లాట్‌కు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్ జైపూర్‌లోని ఫెయిర్‌మౌంట్‌లో ఉంచింది. ఈ క్రమంలో ఆదివారం సరదాగా కొందరు ఎమ్మెల్యేలు అంత్యాక్షరి ఆడుతూ కనిపించారు. మరికొందరు తంబోలా ఆడుతూ, టీవీ చూస్తూ […]
ఇటీవల ఆత్మహత్యకు చేసుకున్న సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసీ రియా చక్రవర్తిని కొందరు ఇన్‌స్టాగ్రామ్‌లో బెదిరించారు. ‘సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు నాకు అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టారు. నన్ను రేప్ చేస్తానని బెదిరిస్తూ ఒకడు మెసేజ్ పంపించగా.. మరోకడు చంపేస్తానని బెదిరించాడు’ అంటూ రియా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సైబర్‌క్రైం టీంతో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
తిరుపతి: తిరుపతి రేణిగుంట విమానాశ్రయం రన్ వేపై తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం విమానం ల్యాండింగ్‌కు ముందు రన్ వే పరిశీలనకు వెళ్లిన ఫైర్ ఇంజిన్ వెహికిల్ బోల్తాపడింది. బెంగళూరు – తిరుపతి విమానం పైలట్ ఈ ప్రమాదాన్ని ముందుగా గుర్తించారు. విమానం రన్ వేపై ల్యాండ్ కాకుండానే బెంగళూరుకు తిరుగు పయనమైంది. హుటాహుటిన అక్కడి చేరుకున్న ఎయిర్‌పోర్టు అధికారులు, సిబ్బంది ఫైర్ ఇంజిన్ వాహనాన్ని తొలగించారు. దీంతో స్థానిక రేణిగుంట విమానాశ్రయంలో పలు ఫ్లైట్లు […]
చెన్నై: త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ కొత్త ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యావీరప్పన్కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆదివారం ఆమెను నియమించింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె గత ఫిబ్రవరిలో బీజేపీలో చేరారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో వీరప్పన్ వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని […]