న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా ఔట్‌డోర్ ప్రాక్టీస్ మొదలుపెడుతున్నారు. తాజాగా పేసర్ మహ్మద్ షమీ.. చాలా రోజుల తర్వాత నెట్స్ బౌలింగ్ చేశాడు. తన సొంతూరులోని ఫామ్ హౌజ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న నెట్స్‌పై అతను బౌలింగ్ యాక్షన్‌ను సరి చూసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్టర్ లో ఉంచాడు. ‘మా బ్రదర్స్‌తో కలిసి ఫామ్ హౌజర్లో క్వాలిటీ ప్రాక్టీస్ సెషన్’ అని రాసుకొచ్చాడు. అయితే ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైనా.. షమీ బౌలింగ్ రిథమ్‌లో ఏమాత్రం […]
కరాచీ: బ్యాటింగ్ విషయంలో పదేపదే తనను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చడం సరైంది కాదని పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు. ఏ విషయంలోనైనా తనను పాకిస్థాన్ దిగ్గజాలతో పోలిస్తే సంతోషిస్తానన్నాడు. ‘మీరు నన్ను మరెవరితోనైనా పోల్చాలనుకుంటే పాక్ ఆటగాళ్లతోనే పోల్చండి. ఎందుకంటే మియాందాద్, యూనిస్ ఖాన్, ఇంజమామ్ లాంటి దిగ్గజాలు మాకూ ఉన్నారు. వాళ్లతో పోలిస్తే నా ఘనతలకు సరైన గుర్తింపు వస్తుంది. నేను కూడా బాగా గర్వపడతా. ప్రపంచ క్రికెట్ […]
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివియర్స్ను ఆపడం కష్టమని భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. ఈ ఇద్దరికి బౌలింగ్ చేయడం కత్తిమీద సామేనని చెప్పాడు. ఈ ఇద్దరిలో తమకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయన్నాడు. ‘స్మిత్ ఎక్కువగా బ్యాక్ ఫుట్ ఆడతాడు. బంతిని కూడా చాలా ఆలస్యంగా ఎదుర్కొంటాడు. దీనివల్ల బంతిని ఏ వైపు టర్న్ చేయాలన్న దానిపై సందిగ్దం తలెత్తుంది. […]
కొలంబో: 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ అయిందన్న ఆరోపణలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఇందుకు సంబంధించిన సరైన ఆధారాలు లేవని లంక క్రీడా మంత్రిత్వ శాఖ విచారణ బృందం స్పష్టంచేసింది. ఈ మేరకు విచారణను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 10 గంటల పాటు అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరను విచారించిన విచారణ బృందం.. అతని స్టేట్మెంట్ను రికార్డు చేసింది. కానీ ఎక్కడా అవినీతి జరిగినట్లు ఆధారాలు లేకపోవడంతో దర్యాపు ముందు సాగలేదు. అరవింద డిసిల్లా (అప్పటి […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా లెక్క తప్పుతోంది. జిల్లా వైద్యశాఖ అధికారులు ఇస్తున్న లెక్కలు, రాష్ట్రస్థాయిలో విడుదల అవుతున్న హెల్త్ బులెటిన్‌లో ఇస్తున్న లెక్కలకు మధ్య భారీగా తేడాలు ఉంటున్నాయి. దీంతో కరోనా కేసులు, మృతులపై తెలంగాణవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎంతమందికి సోకిందన్న పూర్తి వివరాలతో పాటు రోజువారీ లెక్కను జిల్లా వైద్యశాఖాధికారులు తమ బులెటిన్‌లో విడుదల చేస్తున్నారు. కానీ, ఆ లెక్కలేవీ రాష్ట్రస్థాయి బులెటిన్‌లో కనిపించడం లేదు. బుధవారం రంగారెడ్డి […]
సారథి న్యూస్, యాదాద్రి: యాదాద్రి ఆంజనేయ, నరసింహ అరణ్యం అర్బన్ ఫారెస్ట్ పార్కులను దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, రాజ్యసభ్య సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. అరణ్యంలో కాలినడకన తిరుగుతూ సందర్శకుల కోసం ఏర్పాటుచేసిన సౌకర్యాలను పరిశీలించారు. అటవీశాఖ ప్రాంతాన్ని వ్యూ పాయింట్ నుంచి తిలకించారు. హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు అడవులను కాపాడుకునేందుకు అత్యంత కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని వెల్లడించారు. సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆలోచనలకు అనుకూలంగా హైదరాబాద్ నలువైపులా ఇతర పట్టణాలకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ఒకరి నుంచి మరొకరిని చుట్టేస్తోంది. శుక్రవారం తాజాగా తెలంగాణలో కొత్తగా 1,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్కేసుల సంఖ్య 20,462కు చేరింది. తాజాగా 8 మంది చనిపోయారు. ఇలా ఇప్పటి వరకు 283 మంది మృత్యువాతపడ్డారు. 10,195 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 9,984 కు చేరింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే..జీహెచ్ఎంసీ పరిధిలో 1,658, […]