లక్నో: 8 మంది పోలీసుల చావుకు కారణమైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దుబేను అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతడ్ని పట్టుకునేందుకు 25 స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ‘వికాస్ దుబే, అతని అనుచరులను పట్టుకునేందుకు 25 స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటుచేశాం. దీని కోసం వివిధ జిల్లాల్లో రైడ్స్ చేస్తున్నాం. రాష్ట్రం, పక్క రాష్ట్రాల్లో కూడా అతని కోసం గాలిస్తున్నాం’ అని కాన్పూర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ […]
పుణే: కరోనా వచ్చినప్పటి నుంచి తరచూ వినిపిస్తున్న పదాలు మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెంసింగ్. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మాస్క్ కచ్చితంగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో చాలా మంది తమ తమ వెసులుబాట్లను బట్టి ఎన్ 95 మాస్కులు, డీఐవై మాస్కులు, బట్టతో ఇంట్లో తయారుచేసిన మాస్కులను ఉపయోగిస్తున్నారు. అయితే పుణే పింప్రీ–చించ్వాడాకు చెందిన శంకర్ కురాడే అందరిలో కల్లా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలనుకున్నాడు. బంగారు మాస్క్‌ను తయారు చేయించుకున్నాడు. రూ.2.89లక్షలు పెట్టి […]
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దకొడుకు జూనిర్ ట్రంప్ గర్ల్‌ఫ్రెండ్ కింబర్లీ గుయిల్ ఫాయల్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. అమెరికా మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ట్రంప్ ప్రచార టీమ్ సీనియర్ ఫండ్ రైజర్‌గా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ దగ్గర పనిచేసే వారిలో వైరస్ బారినపడిన మొదటి వ్యక్తి ఈమె. ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవని, అయినా పాజిటివ్ వచ్చిందని వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి దక్షిణ డకోటాలో […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. రోజుకు దాదాపు 20వేలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక్కరోజులోనే 22,771 కేసులు నమోదైనట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ శనివారం హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. దీంతో కేసుల సంఖ్య 6,48,315కు చేరింది. ఒక్క రోజులో 442 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 3,94,227 మంది కోలుకోగా.. 2,35,433 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజే 14వేల మంది కోలుకున్నారని అధికారులు చెప్పారు. మన దేశంలో రికవరీ […]
న్యూఢిల్లీ: ఫుల్లుగా మద్యం తాగి కారు నడిపిన ఓ పోలీసు వేగం అదుపు తప్పి మహిళను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ప్రమాదానికి కారణమైన పోలీస్ ఆఫీసర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఢిల్లీలోని చిల్లా గ్రామం సమీపంలో ఒక పోలీస్ ఆఫీసర్ రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు. దాన్ని గమనించిన స్థానికులు ఆమెను కాపాడేందుకు దగ్గరికి వచ్చేలోపే కారును మళ్లీ ఆమెపై నుంచి పోనిచ్చాడు. దీంతో […]
జెనీవా: కరోనా మహమ్మారి గురించి చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కార్యాలయం నుంచి హెచ్చరికలు వచ్చాయని, చైనా స్వయంగా దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని డబ్ల్యూహెచ్‌వో క్లారిటీ ఇచ్చింది. డబ్ల్యూహెచ్‌వో గతంలో ఇచ్చిన క్రానాలజీలో డిసెంబర్ 31న వుహాన్‌లోని హుబే ప్రావిన్స్‌లో న్యుమోనియా కేసులను గుర్తించామని మాత్రమే ఇచ్చారని చెప్పింది. ఏప్రిల్ 20న విలేకరులతో మాట్లాడిన డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసన్ చైనా నుంచి నివేదిక వచ్చిందన్నారు కానీ.. ఎవరు ఇచ్చారనే దానిపై […]
స్టార్ హీరోలకు విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉండడం పెద్ద విషయమేమీ కాదు. ఆ ఫాలోయింగ్‌లో అభిమానులను అనుకరించడం ఇప్పటి ట్రెండ్‌కు పెద్ద ఫ్యాషన్ అయింది కూడా. అదే ఎన్టీఆర్ విషయంలో జరుగుతోంది. ఎన్టీఆర్‌కు టాలీవుడ్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే జపాన్‌లో ఎన్టీఆర్ సినిమాలకు మాంచి డిమాండే ఉంది. అక్కడి వాళ్లు తారక్ చిత్రాలను తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. తాజాగా జపాన్‌లో ఓ జంటకి ఎన్టీఆర్ పై అభిమానం పీక్స్‌లోకి వెళ్లి […]
సారథి న్యూస్, బెజ్జంకి: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామంలో సీసీ రోడ్లు, మహిళా భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. సీఎం కేసీఆర్‌కు సంక్షేమ పథకాలు మంచి పేరు తెచ్చిపెట్టాయని అన్నారు. హరితహారం ఒక ఉద్యమంలా సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ సభ్యురాలు కనగండ్ల కవిత, సర్పంచ్ కనగండ్ల రాజేశం, ఎంపీటీసీ రాజు, ఎంపీడీవో ఓబులేష్ పాల్గొన్నారు.