Breaking News

Day: June 26, 2020

మిర్చి రైతులకు న్యాయం చేయండి

మిర్చి రైతులకు న్యాయం చేయండి

సారథి న్యూస్, కర్నూలు: రైతులకు నాసిరకం మిరప మొక్కలను సరఫరా చేసిన నర్సరీ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి నుంచే నష్టపరిహారం రాబట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ అధికారులను డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట మిర్చి రైతులకు నర్సరీ యాజమాన్యం నష్టపరిహారం ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. రామళ్లకోట గ్రామంలో సుమారు వెయ్యి ఎకరాల్లో మిరప పంటవేశారు. స్థానిక వీఎన్ఆర్​కంపెనీ నుంచి విత్తనాలు తెచ్చి నర్సరీ […]

Read More
కరోనా.. అంతకంతకు

కరోనా.. అంతకంతకు

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది.. కొత్త వ్యక్తులకు అంటుకుంటోంది. శుక్రవారం 4,374 మందిని పరీక్షించగా 985 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఇప్పటి వరకు మొత్తంగా 12,349 పాజిటివ్ ​కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా వ్యాధిబారిన పడి ఏడుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు 237 మంది చనిపోయారు. యాక్టివ్​ కేసులు 7,436 ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 774 కేసులు […]

Read More
ఉత్సాహంగా హరితహారం

ఉత్సాహంగా హరితహారం

సారథి న్యూస్​, నల్లగొండ: నల్లగొండ జిల్లా అన్నెపర్తి శివారులోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్​రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ పాటిల్ మొక్కలు నాటారు. వాతావరణంలో సమతుల్యం లోపించడంతోనే వర్షాలు కురవడం లేదని మంత్రి జగదీశ్వర్​రెడ్డి అన్నారు.

Read More
పీవీ శత జయంతి వేడుకలకు ఏర్పాట్లు

పీవీ శతజయంతి వేడుకలకు ఏర్పాట్లు

సారథి న్యూస్​, హైదరాబాద్​: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని పీవీ మెమోరియల్ జ్ఞానభూమిలో ఏర్పాట్లపై అధికారులను అడిగి ఆరాతీశారు.

Read More
అనుక్షణం అప్రమత్తంగా ఉండండి

అనుక్షణం అప్రమత్తంగా ఉండండి

సారథి న్యూస్​, కర్నూలు: కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో మార్గదర్శకాలను పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి కరోనా కట్టడి చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో అధిక సంఖ్యలో బెడ్లను సిద్ధం చేసుకోవడంతో పాటు లక్షణాలు ఉన్న వ్యక్తులను హోం ఐసోలేషన్ లోనే ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ జి. వీరపాండియన్ మాట్లాడుతూ […]

Read More
రైతు వేదికలకు శ్రీకారం

రైతు వేదికకు శ్రీకారం

సారథి న్యూస్, వెల్దండ: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావిస్తున్న రైతు వేదికల నిర్మాణానికి నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్​ యాదవ్, కలెక్టర్ ​ఈ.శ్రీధర్​ శ్రీకారం చుట్టారు. శుక్రవారం వెల్దండ మండలం కొట్ర గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రైతు వేదిక పనులకు శంకుస్థాపన చేశారు. వీలైంత తొందరగా పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన శ్మశానవాటికను ప్రారంభించడంతో పాటు ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు […]

Read More
కరోనా రాదని.. అనుకోవద్దు

కరోనా రాదని.. అనుకోవద్దు

సారథి న్యూస్, కర్నూలు: ‘కరోనా వైరస్‌ నాకు రాదని, నేను ఆరోగ్యంగా బలంగా ఉన్నానని, పొరపాటున కూడా అనుకోవద్దని’ ట్రాఫిక్‌ డీఎస్పీ మహబూబ్‌బాషా ప్రజలకు వినూత్నరీతిలో అవగాహన కల్పించారు. శుక్రవారం నగరంలోని రాజ్‌ విహార్‌, ఆర్‌ఎస్‌ రోడ్డు, బస్టాండ్‌ ప్రాంతాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు, ప్రజలకు కరోనా వైరస్‌ పై అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ మాస్క్‌ కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, అవసరమైతేనే బయటికి రావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్​దూరం పాటించాలని ఆదేశించారు. నగరంలో మాస్క్‌ […]

Read More
కరోనాకు అడ్డుకట్ట వేద్దాం

కరోనాకు అడ్డుకట్ట వేద్దాం

సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాని ఆంధ్రప్రదేశ్ ​డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(ఆళ్ల నాని), రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌ గెస్ట్​హౌస్​లో కరోనా కట్టడి చర్యలపై జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసీ రవిపట్టన్‌ షెట్టి, రాంసుందర్‌ రెడ్డి, నగరపాక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, ట్రైనీ కలెక్టర్‌ నిధిమీనా, వైద్యారోగ్య శాఖ అధికారులతో […]

Read More