Breaking News

Day: June 25, 2020

కోదాడలో తొలి కరోనా

సారథిన్యూస్​, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో తొలి కరోనా కేసు నమోదైంది. పట్టణానికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11న ఓ వివాహవేడుకలో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వెళ్లాడు. రెండ్రోజుల పాటు అక్కడే ఉన్నాడు. పెళ్లి నుంచి వచ్చినప్పటి నుంచి అస్వస్థతతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడికి వైద్యపరీక్షలు చేయగా కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో అతడిని సూర్యాపేట దవాఖానకు తరలించారు. కాగా ఆ యువకుడి ప్రైమరీ కాంటాక్ట్​లను […]

Read More

సబ్​రిజిస్ట్రార్​ పెద్దమనసు

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలో సబ్​రిజిస్ట్రార్​కు పనిచేస్తున్న తస్లీమా.. నిబద్ధతతో విధులు నిర్వర్తించడమే కాక తన వద్దకు వచ్చిన నిరుపేదలకు తోచిన సాయం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్న నేపాల్​కు చెందిన ధీరజ్​ జోషి అనే గుర్ఖాకు గోధుమపిండి, నిత్యావసరసరుకులు పంపిణీ చేశారు. అనంతరం పందికుంట గ్రామానికి చెందిన అనిత అనే మహిళకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారి పిల్లల చదువులకు సంబంధించిన బాధ్యత […]

Read More

హరితహారం స్వర్ణహారం కావాలి

సారథి న్యూస్, అలంపూర్: ఆలంపూర్ జోగుళాంబ పుణ్యక్షేత్రం ఆవరణలో మొక్కలు నాటి ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని మున్సిపల్​చైర్మన్​వెంకటేశ్, కమిషనర్​మదన్​మోహన్​గురువారం ప్రారంభించారు. హరితహారం స్వర్ణహారం కావాలని వారు ఆకాంక్షించారు. మున్సిపాలిటీలో ఒక్కో వార్డులో వంద మొక్కల చొప్పున నాటడమే కాకుండా ప్రతి ఇంటికి మూడు మొక్కల చొప్పున నాటాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ ఆఫీసుల మైదానాల్లో మొక్కలు నాటాలని సంకల్పించారు. అంతకుముందు ప్రభుత్వ జూనియన్​ కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పుష్పలత, జయలక్ష్మి, టీఆర్ఎస్ […]

Read More

హరిత తెలంగాణే లక్ష్యం

  • June 25, 2020
  • Comments Off on హరిత తెలంగాణే లక్ష్యం

కలప అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రత్యేక విభాగం మొక్కలకు కుటుంబసభ్యుల పేర్లు పెట్టుకోవాలె నర్సాపూర్ లో మొక్కలు నాటిన సీఎం కేసీఆర్​ అట్టహాసంగా ఆరో విడత హరితహారం ప్రారంభం సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్రంలో అడవుల పునరుద్ధరణే హరితహారం ముఖ్య ఉద్దేశమని సీఎం కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మనం చేతులారా పోగొట్టుకున్న అడవిని తిరిగి మనమే వందశాతం తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ లో మొక్కలు నాటి ఆరో విడత […]

Read More

చైనా వస్తువులను బహిష్కరిద్దాం

సారథి న్యూస్, కర్నూలు: ఇండియా బోర్డర్​లోని గాల్వాన్‌ లోయలో చైనా సైనికుల దుశ్చర్యకు 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారని, ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారి వస్తువులను బహిష్కరించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్​ పార్థసారధి పిలుపునిచ్చారు. చైనా వస్తువులను బహిష్కరించే అవకాశం భారత ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని ప్రతిఒక్కరికీ కల్పించారని పేర్కొన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రతి పౌరుడు మేడిన్‌ ఇండియా వస్తువులనే కొనాలని కోరారు.

Read More

ఇండియా– చైనా పరిష్కరించుకోవాలి

లండన్‌: ఇండియా – చైనా మధ్య నెలకొన్న గొడవను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని యూకే ప్రధాని బొరిస్‌ జాన్సన్‌ అన్నారు. ‘ఒక దేశం కామన్‌ వెల్త్‌ మెంబర్‌‌, మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ ఒకవైపు. ప్రజాస్వామ్యం అనే మన భావనను సవాలు చేసే రాష్ట్రం. రెండు దేశాల మధ్య జరుగుతున్న సంఘటనలను యూకే నిశితంగా పరిశీలిస్తోంది’ అని అన్నారు. ఈస్ట్రన్‌ లద్దాఖ్‌లో పరిస్థితి సీరియస్‌గా, ఆందోళనకరంగా ఉందన్నారు. రెండు దేశాలు మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తున్నామన్నారు. […]

Read More

సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్‌ రద్దు

న్యూఢిల్లీ: కరోనా ప్రబలుతున్న కారణంగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఎగ్జామ్స్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. గురువారం విచారణ జరిగిన సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన తుషార్‌‌ మెహతా ఈ విషయాన్ని కోర్టుకు చెప్పారు. జులై 1 నుంచి 15 వరకు జరగాల్సిన సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. వాటితో పాటు ఐసీఎస్‌ఈ పరీక్షలను కూడా క్యాన్సిల్‌ చేశామన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ, […]

Read More

ఏపీలోనూ 10వేల కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్​ కేసుల సంఖ్య 10వేలు దాటింది. 24 గంటల్లో 19,085 టెస్టులు చేయగా, 553 మందికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన వారిలో 477 మందికి పాజిటివ్‌ రాగా.. విదేశాల నుంచి వచ్చిన వారికి ఏడుగురికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 69 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రానికి చెందిన వారి కేసుల సంఖ్య 8783 కాగా.. విదేశాలకు చెందిన వారి సంఖ్య 371, […]

Read More