Breaking News

Day: June 15, 2020

కరోనా @ 5,193

కరోనా @ 5,193

సారథి న్యూస్​, హైదారాబాద్​: తెలంగాణలో సోమవారం కొత్తగా 219 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్త 189 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,193కు చేరింది. తాజాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 187 మంది చనిపోయారు. కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకు 2,766 మంది డిశ్చార్జ్‌ కాగా, ప్రసుత్తం 2240 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మిగిలిన వాటిలో మేడ్చల్‌ 2, రంగారెడ్డి […]

Read More

వారం పదిరోజుల్లో రైతుబంధు

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి దాని ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధమయ్యారని సీఎం కె.చంద్రశేఖర్​రావు సంతోషం వ్యక్తంచేశారు. ఒక్క ఎకరా మిగలకుండా అందరికీ వారం పదిరోజుల్లో రైతుబంధు సొమ్మును బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని సీఎం ఆదేశించారు. సోమవారం అధికారులతో ఆయన సమీక్షించారు. మార్కెట్లో డిమాండ్ కలిగిన వంటలను వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ప్రతిపాదించిందని […]

Read More

కరోనా టెస్టులు చేసే ల్యాబ్స్​ ఇవే

  • June 15, 2020
  • Corona
  • labs
  • Comments Off on కరోనా టెస్టులు చేసే ల్యాబ్స్​ ఇవే

సారథి న్యూస్​, హైదారాబాద్​: తెలంగాణలో కరోనా పరీక్షలు చేసే ప్రైవేట్​ ల్యాబ్స్​ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్ లాబొరేటరీ సర్వీసెస్, హిమాయత్ నగర్ లోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, చర్లపల్లిలోని విమ్తా ల్యాబ్స్, బోయినపల్లి అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, డయాగ్నొస్టిక్ లాబొరేటరీ పంజాగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్, మేడ్చల్ లోని పాత్‌ కేర్ ల్యాబ్‌, లింగంపల్లిలోని అమెరికన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్, న్యూబోయినపల్లిలోని […]

Read More

కొడుకులు చూడడం లేదని..

సారథి న్యూస్, హుస్నాబాద్: కొడుకులు తన బాగోగులు చూసుకోవడం లేదని ఓ వృద్ధుడు సోమవారం అధికారులను ఆశ్రయించాడు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామపరిధిలోని శంకర్ నగర్ కు చెందిన పోతు మల్లయ్యకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. తనకున్న ఆస్తినంతా కొడుకులు లాక్కొని ఏ ఒక్కరూ చేరదీయకపోవడంతో అధికారులను ఆశ్రయించాడు. వృద్ధుడిచ్చిన ఫిర్యాదుకు స్పందించిన ఆర్డీవో జయచంద్రారెడ్డి మల్లయ్య గ్రామానికి వెళ్లి కొడుకులతో మాట్లాడారు. అయినా వారు వినిపించకపోవడంతో పోతు మల్లయ్యను అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న […]

Read More

ప్రజావాణి వినతుల స్వీకరణ

సారథి న్యూస్, ములుగు: కలెక్టరేట్ లో ప్రజల నుంచి సోమవారం విజ్ఞప్తులు స్వీకరించినట్లు ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య తెలిపారు. భూసమస్యలకు సంబంధించి 25, సదరం పెన్షన్లకు సంబంధించి మూడు, ఇతర శాఖలకు సంబంధించి మూడు .. మొత్తం 31 విజ్ఞప్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. కోవిడ్-19 నియంత్రణ దృష్ట్యా భౌతిక దూరాన్ని పాటించి, వచ్చిన దరఖాస్తులను శానిటైజేషన్​ కు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మాస్క్​లు తప్పకుండా కట్టుకోవాలని, భౌతికదూరం పాటించాలని కలెక్టర్​ సూచించారు.

Read More
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్కకు వినతిపత్రమిస్తున్న ప్రైవట్​ టీచర్లు

కష్టాల్లో ప్రైవేట్​ టీచర్లు

సారథి న్యూస్, ములుగు: లాక్​డౌన్​తో ప్రైవేట్​ స్కూల్​ టీచర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారని.. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం నాయకులు సోమవారం ములుగులో ఎమ్మెల్యే సీతక్కకు వినతిపత్రమిచ్చారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రైవేట్​ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నల్లెల కుమారస్వామి, ఆక రాధాకృష్ణ, మైల జయరాం రెడ్డి, నమాకరం చంద్ బానోతు రవి చందర్, మామిడి శెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు.

Read More

డెయిరీఫామ్ పనులు వేగవంతం

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన మోడల్​ డెయిరీఫామ్​ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కృష్ణఆదిత్య అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో కలెక్టర్​ మాట్లాడారు. ములుగు మండలంలోని పేదలను గుర్తించి వారికి గేదెలను పంపిణీచేయాలని సూచించారు. ఇందుకోసం ఎస్సీ కార్పొరేషన్, జిల్లా పశుసంవర్థక అధికారి, జిల్లా ప్రణాళికాధికారితో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. సమీక్షలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి కే […]

Read More
BJP

మోదీ పాలన అవినీతి రహితం

సారథి న్యూస్, ములుగు: ప్రధాని నరేంద్రమోదీ పాలన అవినీతి రహితంగా కొనసాగుతున్నదని బీజేపీ నాయకుడు భూక్య జవహర్ లాల్ పేర్కొన్నారు. సోమవారం ములుగులో మోదీపాలన పై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ మాట్లాడుతూ మోదీ పాలనలో దేశం సుభిక్షంగా ఉన్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంబిడి లక్ష్మణ్​ రావు, బుర్ర మహేష్, బైకని రాజు, సాంబరాజు కిరణ్, కన్నెబొయిన వీరెందర్, కొప్పుల రజనికర్, ఆకుల సాంబయ్య, గంగుల రాజు, రామిడి […]

Read More