మెగా ఫ్యామిలీ మెంబర్స్‌కు మెగా మనసు ఉంటుందని మరోసారి నిరూపించారు రాంచరణ్ భార్య ఉపాసన కొణిదెల. ఆమె కొన్ని రోజుల క్రితం శ్రీశైలం పరిసరాల్లోని గిరిజనులకు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారట. ఈ నేపథ్యంలో ఉపాసన తన టీమ్‌తో నల్లమల అటవీ ప్రాంతాలలో చెంచు గూడేలను సందర్శించారు. ఆ గూడెంలోని ప్రజల సంస్కృతి వారి జీవన విధానానికి ఆమెంతో మురిసిపోయారు. వారితో పంచుకున్న విషయాలు..ఆ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాతో పంచుకుంటూ.. […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పలుగ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రపథకాలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జి దిలీప్ ఆచారి కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు అందిస్తున్నా.. వాటిని సద్వనియోగం చేసుకోవడంతో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని ఆచారి ఆరోపించారు. సీఎం కేసీఆర్ మాయమాటలతో రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆయన వెంట నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ కార్యదర్శి నారాయణ […]
సారథి న్యూస్ , నల్లగొండ: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి అందరి ప్రశంసలు అందుకున్నాడో ట్రాఫిక్ పోలీస్.నల్లగొండ జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్లో హఫీజ్ ట్రాఫిక్ పోలీస్‌గా పనీచేస్తున్నాడు. బుధవారం ఓ వాహనదారుడు కారులో రాంగ్రూట్లో వస్తుండగా.. హఫీజ్ అతడి కారును ఆపాడు. తాను చెన్నైకి చెందిన ఒక ట్రావెల్ ఏజెన్సీలో డ్రైవరుగా పని చేస్తున్నట్టు డ్రైవర్ తెలిపాడు. హైదరాబాద్ నుంచి నల్లగొండ వైపు వస్తుండగా.. చిట్యాలకు వచ్చినప్పటి నుంచి ఛాతిలో నొప్పి వస్తున్నదని.. […]
టాలీవుడ్లో సెలబ్రిటీ బ్యాచిలర్స్ అంతా పెళ్లి బాట పడుతున్నారు. నిన్న హీరో రానా.. నేడు సాహో డైరెక్టర్ సుజీత్ కూడా సైలెంట్ గా తన నిశ్చితార్థం జరుపుకున్నాడు. ‘రన్ రాజా రన్’తో డైరెక్టర్‌గా పరిచయమైన సుజిత్ తన రెండో సినిమానే పాన్ ఇండియా సినిమాగా ‘సాహో’ను తీసి ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. అసలు విషయానికొస్తే కొంతకాలంగా ప్రవల్లిక అనే డాక్టర్‌తో ప్రేమలో ఉన్నాడు సుజీత్. ఆ ప్రేమను పెళ్లి పీటల వరకూ తీసుకెళ్లి మూడు […]
‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరింది కీర్తిసురేష్. నెక్ట్స్ ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి ప్రధానపాత్రలో ఈశ్వర్ కార్తీక్ రూపొందించిన ‘పెంగ్విన్’ సినిమా మూడు భాషల్లో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్‌కు సిద్ధమైంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా నిర్మాత. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం తెలుగులో నాని, తమిళంలో ధనుష్, మలయాళంలో మోహన్ లాల్ విడుదల చేశారు. ఓ అడవికి సమీపంలో ఓ ఫామ్ హౌస్ […]
సారథిన్యూస్, శ్రీకాకుళం: వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాండ్యాం గ్రామ సమీపంలోని రెల్లి గెడ్డపై రూ.26.42 కోట్లతో నిర్మించే ఎత్తిపోతల పథకానికి శాసన సభాపతి తమ్మినేని గురువారం శంకుస్దాపన చేశారు. ప్రతి గడపకు పరిపాలన చేరవేయడమే సీఎం జగన్ ఆలోచన అన్నారు. తాండ్యాం ఎత్తిపోతల పథకాన్ని రూ.26.42 కోట్లతో నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా తాండ్యాం, పొందూరు, కృష్ణాపురం, మాల్కం గ్రామాలకు చెందిన […]
సారథిన్యూస్, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలోని ఓ వార్డుకు ఇటీవల కరోనాతో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్ మనోజ్ కుమార్ పేరు పెట్టారు. కరోనా భారినపడ్డ జర్నలిస్టులకు ఇకపై ప్రత్యేకవార్డులో చికిత్సనందించనున్నట్టు గాంధీ వైద్యులు తెలిపారు. గాంధీ దవాఖానలోని ఆరో అంతస్తులో మనోజ్పేరుతో ఓ వార్డు ఏర్పాటు చేసినట్టు దవాఖాన వర్గాలు తెలిపాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటికే 16 మంది జర్నలిస్ట్‌లకు కరోనా సోకగా, మనోజ్ చనిపోయారు. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. స్పందించిన ప్రభుత్వం […]
సారథిన్యూస్, హైదరాబాద్: పంటలు ఆరబోసుకోవడానికి కల్లాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే కల్లాలు నిర్మించాలని యోచిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి వర్గ ఉపసంఘం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మినిస్టర్ క్వార్టర్స్ లోని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో మంత్రులు హరీష్ రావు. జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశమై పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉపాధి హామీ పథకం కింద హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో దాదాపు లక్ష […]