సారథి న్యూస్, హుస్నాబాద్: సీఎం కేసీఆర్ కు గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ కట్టపై కుర్చీవేశామని, కూర్చొని ప్రాజెక్టును పూర్తిచేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. మిడ్ మానేరు నుంచి గౌరవెల్లి ప్రాజెక్టులోకి రెండు చిన్న చిన్న లింకులను కలిపితే 12 కి.మీ. సొరంగ మార్గం ద్వారా ప్రాజెక్టులోకి నీళ్లు వస్తాయన్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం గౌరవెల్లి, గండిపల్లి భూ నిర్వాసితులకు సకాలంలో […]
మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సారథి, న్యూస్, మహబూబ్ నగర్: మహిళలు ఆర్థికంగా ఎదగాలని, అందుకోసమే మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీలేని లోన్లు ఇస్తోందని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పాలమూరు జిల్లా స్వయం సహాయక సంఘం మహిళలు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు ఎగ్జిబిషన్ ను శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే మహబూబ్ నగర్ లో వెయ్యి ఎకరాల స్థలంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ […]
సారథి న్యూస్, గోదావరిఖని: విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణ తప్పినందుకు ఏఆర్ కానిస్టేబుల్ ఎండీ షబ్బీర్ ను సస్పెండ్ చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.
సారథి న్యూస్, గోదావరిఖని: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రెని హాస్పిటల్ కరీంనగర్ డాక్టర్ బంగారి స్వామి, డాక్టర్ శంకర్నాథ్ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. పోలీసులు విపత్కకర సమయంలో ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు.
సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లాలో అల్లిపూర్ గ్రామం పేరు చెబితేనే.. ఠక్కున గుర్తుకొచ్చేది తాటి ముంజలే. ఇక్కడ వందల ఎకరాల్లో సహజసిద్ధంగా ఉన్న తాటిచెట్లు గ్రామానికి వన్నె తెచ్చేలా ఉన్నప్పటికీ కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి. తాటి ముంజల్లో పోషక విలువలు పుష్కలంగా ఉండడంతో మంచి డిమాండ్ కూడా ఉంది. మండల కేంద్రానికి పది కి.మీ. దూరంలో ఉన్న అలీపూర్ గ్రామంలో ఎక్కువ విస్తీర్ణంలో తాటి వనాలు ఉన్నాయి. మే నెలలో వాటి అమ్మకాలతో ఈ […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ పట్టణంలోని 11వార్డు పాత పాలమూరు కౌన్సిలర్ ఎన్.శ్రీనివాసులు, 41వ వార్డు కౌన్సిలర్ రఫీయా అంజద్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో శుక్రవారం చేరారు. స్థానిక టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ వారికి కండువా కపి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక రంగ అకాడమీ చైర్మన్ బద్మి శివకుమార్, మున్సిపల్ చైర్మన్ కోరమొని నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమొని వెంకటయ్య, మున్సిపల్ వైస్ […]
దేశానికి ఆదర్శం కావాలె రైతులకు త్వరలోనే తీపికబురు బంగారు తెలంగాణే నా ఆశయం ఇది నియంతృత్వ సాగు కాదు కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, మెదక్: ‘దేశానికి మనం ఆదర్శం కావాలి.. అద్భుతాలు సృష్టించే రైతాంగం కావాలి. అన్ని కులాలు, అన్ని మతాలు.. అద్భుతంగా బతకాలి. అదే నా ఆశయం, కల. దేశానికి మార్గదర్శకం అయ్యాం..’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రైతులకు త్వరలోనే తీపికబురు చెబుతానని ప్రకటించారు. కాళేశ్వరం ఎత్తిపోతల […]
సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలం పాలకుర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. శుక్రవారం చిన్నజీయర్ స్వామితో కలిసి సీఎం కె.చంద్రశేఖర్‌రావు దంపతులు మోటార్లను ఆన్‌చేసి ప్రారంభించారు. మర్కుక్ పంప్ హౌస్ నుంచి కొండపోచమ్మ సాగర్ లోకి గోదావరి నీటి చేరికతో కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సముద్రమట్టానికి 618 మీటర్ల ఎత్తున నిర్మించిన రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా రాష్ట్రం […]