టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్. ధోనీ తన గురువు అని వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. యంగ్ ప్లేయర్లకు సాయం చేయడంలో మహీకి ప్రత్యేక పద్ధతి ఉందన్నాడు. సమస్య పరిష్కారానికి చాలా మార్గాలు సూచిస్తాడన్నాడు. ‘ధోనీ నా గురువు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఏ సందేహం వచ్చినా నేను ముందు మహీ బాయ్ కి ఫోన్ చేస్తా. అయితే నా సమస్యకు పూర్తి పరిష్కారం చూపకుండానే అనేక మార్గాలు […]
ఎండుమిర్చిన తీసుకెళ్తుండగా ఘటన.. మృతులు రైతులు సారథి న్యూస్, రంగారెడ్డి: అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ సంఘటన మాడ్గుల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం.. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం, శాంతిగూడెం గ్రామానికి చెందిన రామచంద్రయ్య(45), సుబయ్య(36) కలిసి ఎండు మిర్చిని ట్రాక్టర్ లో ఇర్విన్ గ్రామానికి తీసుకొచ్చారు. తిరిగి వెళ్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో రామచంద్రయ్య, సుబ్బయ్య […]
– లక్ష పడకలు సిద్ధం చేయండి – అధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష సారథి న్యూస్, అనంతపురం: కరోనా కేసులు ఎక్కువగా నమోదైన క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. కొవిడ్-19 నివారణ చర్యలు, లాక్ డౌన్ పొడిగింపు, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలపై మంత్రులు ఆళ్ల నాని, కన్నబాబు, సీఎస్ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: హన్వాడ సీహెచ్ సీ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నర్సులకు, ఆశా కార్యకర్తలకు మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పాఠశాల వద్ద వివిధ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. తెలంగాణ చౌరస్తాలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన అనంతరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద పూజలు చేశారు. అనంతరం మహబూబ్ నగర్ బోయపల్లి గేట్ సమీపంలో ఉన్న వీవీ కన్వెన్షన్ లో వాసవీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు […]
– అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు సారథి న్యూస్, అనంతపురం: హిందూపురం రెడ్ జోన్లలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం సాయంత్రం హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను చర్చించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండేలా, సామాజిక దూరం పాటించేలా రెడ్ జోన్లలో ఆటోల ద్వారా ప్రచారం చేయాలని తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఎవరికైనా అనుమానిత లక్షణాలు ఉంటే టోల్ […]
– టీటీడీ చైర్మన్ ఎస్ వీ సుబ్బారెడ్డి సారథి న్యూస్, అనంతపురం: తిరుమలలో ఒకేసారి లక్షల మంది దర్శనాలు సాధ్యం కాదని టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి అన్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పిన ఆయన లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత కూడా భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా క్యూ లైన్లలో మార్పులు ఉంటాయన్నారు. భక్తులకు మాస్క్ లు, శానిటైజర్లు వంటి సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. […]
– ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సారథి న్యూస్, ఖమ్మం: లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి మాస్క్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారికి ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఫైన్ విధించారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్ పర్యటించారు. ఇల్లందు చౌరస్తాలో నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో మాస్క్ లేకుండా వస్తున్న వారి వాహనాలను నిలిపి బాధ్యతలను గుర్తు చేస్తూ జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేస్తున్నామని సీపీ తెలిపారు. ఆయన […]
సారథి న్యూస్, అనంతపురం: ఏపీలో మద్యం ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ అనుమతితో ఏప్రిల్ 3 నుంచి 20 డిస్టలరీలు తెరుచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం తయారీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. మద్యం తయారీ కంపెనీలు పూర్తిగా శానిటైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు నిర్దేశించింది. అలాగే కంపెనీలో కార్మికులు సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. మద్యం తయారీ కంపెనీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు వేర్వేరుగా […]