సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో టీజేఏసీ ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి 134వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రజా వాగ్గేయకారుడు రాజారామ్ ప్రకాష్ మాట్లాడుతూ.. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక సంపాదకుడి, పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. తెలంగాణకు ఆయన వరం లాంటి వారని అన్నారు. నిజాం పాలనపై గర్జించిన యోధుడని కొనియాడారు. కార్యక్రమంలో కవిపండితుడు గిరిరాజాచారి, వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు […]
సారథి న్యూస్, సూర్యాపేట: సీఎం కేసీఆర్ సంకల్పం మేరకే డబుల్ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరిలో 82 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి ప్రారంభించారు. అలాగే 80 మంది లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని విధిగా అమలు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్పర్సన్ దీపిక పాల్గొన్నారు.
సారథి న్యూస్, శ్రీకాకుళం: గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది కష్టపడి పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఏజేసీ డాక్టర్ కె.శ్రీనివాసులు సూచించారు. గురువారం ఉదయం స్థానిక బాపూజీ కళామందిర్ లో శ్రీకాకుళం డివిజన్ స్థాయిలోని గ్రామ వార్డు కార్యనిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో 935 సచివాలయాలు ఉన్నాయని, వీటిద్వారా 15 రకాల సేవలు అందించాలన్నారు. మీకు అప్పగించిన పనులను సక్రమంగా పూర్తిచేసి అటు ఆర్జీదారులు, ఇటు జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో […]
సారథి న్యూస్, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంజనగార్డెన్స్ లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నారాయణపేట నియోజకవర్గ స్థాయి వానాకాలం వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, నూతన వ్యవసాయ విధానంపై గురువారం రైతులు, అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. లాభం వచ్చే పంటలను మాత్రమే వేయాలని రైతులను కోరారు. ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ అధికారుల సూచనలు పాటించాలని […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని ప్రభుత్వం పదేపదే చెబుతోంది.. హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కానీ కొందరు వ్యాపారులు, ఫారెస్ట్ ఆఫీసర్లు కుమ్మకై చెట్లను ఇష్టారీతిలో అడవులను నరికేస్తున్నారు. ప్రతిరోజూ లారీలు, ట్రాక్టర్లలో లోడ్ చేసి పొరుగు రాష్ట్రాలు దాటించేస్తున్నారు. కంగ్టి, కల్హేర్, మనూర్ ఉమ్మడి మండలంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా చెట్లను నరికివేస్తున్నారు. కంగ్టి మండలం నుంచి ప్రతిరోజు ఐదు నుంచి పది ట్రాక్టర్ల కలప అక్రమంగా […]
యువ యాంకర్ ప్రేక్షమెహతా సూసైడ్ మంచి భవిష్యత్ ఉన్న ఫ్యామస్ యాంకర్ హోస్ట్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ జాతీయ టెలివిజన్ రంగంలో విషాదం నింపింది. గత రాత్రి ప్రేక్షమెహతా అనే యువ యాంకర్ ఆత్మహత్య చేసుకోవడం హిందీ వినోదరంగంలో కలకలం సృష్టించింది. మరణానికి ముందు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు మరింత సంచలనాన్ని సృష్టించింది. బాలీవుడ్ లో నటిగా గుర్తింపు పొందిన ప్రేక్షమెహతా అక్షయ్ కుమార్ నటించిన ‘ప్యాడ్ మ్యాన్’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. […]
100 మంది క్వారంటైన్‌లోకి భోపాల్: పెళ్లయిన కొద్ది గంటలకే ఆ జంట క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. పెండ్లి కొచ్చిన చుట్టాల్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో కొత్త జంటతో సహా వందమంది అధికారులు క్వారంటైన్‌లోకి పంపించారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో మంగళవారం ఈ విషయం వెలుగుచూసింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)లో ఉద్యోగం చేస్తున్న వధువు బంధువు గతవారం ఛింద్వారా జిల్లాలోని జున్నార్దియోలో ఉన్న ఇంటికి వెళ్లారు. ఆ వ్యక్తి ఈ నెల 26న తన […]
లక్నో: ఏతల్లి కన్న బిడ్డనో.. బతికుండగానే మట్టిలో కప్పిపెట్టాలనుకున్నారు. ఆ ఎంత కష్టమొచ్చిందో ఆ బిడ్డను వదిలించుకోవాలనుకుంది. బిడ్డ కంట్లో నలుసు పడితేనే తట్టుకోలేని తల్లి బతికుండగానే మట్టిలో పాతిపెట్టింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిదార్ధనగర్‌లో ఇంటి నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో అక్కడి కూలీలకు చిన్నపిల్లల ఏడుపు వినిపించింది. దీంతో ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందో అని వెతుకుతూ వెళ్లిన కూలీలకు మట్టిలో నుంచి చిన్నారి చేయి బయటకు కనిపించింది. అక్కడ జాగ్రత్తగా తవ్వి చూడగా.. అప్పుడే పుట్టిన […]