సారథి న్యూస్,ఖమ్మం: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నల్లమోతు అప్పారావు (45) తన కొడుకు తేజు (20), మేనల్లుడు వినయ్ (19)తో కలిసి మంగళవారం పొలంలో కూరగాయల పంటకు పురుగు మందు పిచికారీ చేశారు. అనంతరం పక్కనే ఉన్న రేపాక చెరువులోకి కాళ్లు కడుక్కునేందుకు వెళ్లారు . ఈ క్రమంలో తేజు చెరువులోకి దిగగా కాలు […]
సారథి న్యూస్, మెదక్: రైలు కింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట సమీపంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తి, మరో మహిళ బైక్‌పై వచ్చి మాసాయిపేట బంగారమ్మ గుడి వద్ద చెట్టు కింద ఆగారు. కొద్దిసేపటి తర్వాత నిజామాబాద్ వైపు నుంచి గూడ్స్ రైలు రావడం గమనించి ఆ ఇద్దరు రైలు పట్టల మీద తలపెట్టి పడుకున్నారు. దీంతో వారి తలల మీద […]
సారథి న్యూస్, నర్సాపూర్: ప్రజాఉద్యమ నేత, సీపీఎం మాజీ అఖిల భారత కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతి సందర్భంగా శివంపేట మండలం దొంతి గ్రామంలో స్థానిక సీపీఎం ఆఫీసులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మెదక్ జిల్లా కార్యవర్గసభ్యుడు ఏ.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మతోన్మాదం, సామ్రాజ్యవాదం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడడమే సుందరయ్యకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. తనవంతు భూమిని పేదలకు పంచిన ఆదర్శమూర్తి అని కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో […]
మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి సారథి న్యూస్, మెదక్: పంటలు సాగుచేసే ప్రతి రైతుకు లాభం చేకూరేలా పంటమార్పిడి విధానం అమలు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో వ్యవసాయ, మార్కెటింగ్, అనుబంధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్స్ ప్రతినిధులు, సీడ్ డీలర్ల అసోసియేషన్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో రైతులలో పంట మార్పిడి, వరి, పత్తి, కంది పంటల సాగు చేసే విధానంపై […]
మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే.. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి దీనికి సంబంధించిన అప్ డేట్ ఏమీ రాదేమోనని ఫ్యాన్ అంతా డీలా పడిపోయారు. పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి హంగామా చేయొద్దని ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేశాడు ఎన్టీఆర్.. కానీ ఊహించని విధంగా ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ డైహార్డ్ అభిమానులకు ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేశాడు. ‘హ్యాపీ బర్త్ డే టు తారక్..’ అంటూ కండలు తిరిగిన దేహంతో ఉన్న ఎన్టీఆర్ సిక్స్ […]
అలనాటి లెజండరీ నటి శ్రీదేవి కూతుళ్లు జాన్వీ, ఖుషీ అని అందరికీ తెలిసిందే. ఆల్ రెడీ జాన్వీ కపూర్ బాలీవుడ్లో ‘ధడక్’ సినిమాతో తెరంగేట్రం చేసి కుర్రకారు గుండెల్లో ధడక్ ధడక్ అంటూ రైళ్లు పరుగెత్తించింది. ఇప్పుడామె చెల్లి ఖుషీ సినిమాలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందట. విదేశాల్లో నటనలో శిక్షణ తీసుకుంటున్న ఈ అమ్మడు త్వరలోనే ఓ మాంచి సినిమాతో రానుందట. అక్కలాగే ఖుషీ కూడా సోషల్ మీడియాలో అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది. లాక్ డౌన్ […]
కండలవీరుడిగా ప్రశంసించుకోవడం ఇష్టం ఉండదేమో కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఎప్పుడూ ఒంటిమీద చొక్కా లేకుండా దర్శనం ఇవ్వలేదు. కానీ ఈ లాక్ డౌన్ మహేష్ ను అలా చూసేందుకు వీలు కల్పించింది. తన చిన్నారి సితారతో స్విమ్మింగ్ పూల్ లో ఈతకొడుతూ తీసుకున్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింటిలో వైరల్ అవుతోంది. షూటింగ్ వాయిదాల వల్ల ఇంటికే పరిమితమైన మహేష్ తన ఫొటోలతో అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత పరుశరామ్ […]
డేటింగ్ లు గ్రటా అన్నీ అయిపోయి దాదాపు పెళ్లి చేసుకుంటున్నారు అనుకునే టైమ్ వచ్చేసరికి ఇద్దరూ విడిపోయారు విశాల్ అండ్ వరలక్ష్మీ శరత్ కుమార్ లు.. సాలిడ్ పర్సనాలిటీతో స్టామినాగా ఉండే ఈ తమిళ ముద్దుగుమ్మ తర్వాతేమో ఓ క్రికెటర్ తో డ్యూయెట్లు పాడుతోంది, పెళ్లికూడా చేసుకుంటుందట అని ట్రోలింగ్ మొదలుపెట్టారు. వాటన్నిటికీ చెక్ పెడుతూ వరలక్ష్మి ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేసింది. ‘ఇప్పుడు నా పెళ్లికి ఏమంత తొందర వచ్చింది.. ఒకవేళ చేసుకుంటే మీ […]