సారథి న్యూస్, విజయనగరం: జిల్లాలో లాక్ డౌన్ పరిస్థితులను విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి బుధవారం పర్యవేక్షించారు. కరోనాను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు సూచించారు. ప్రధాన జంక్షన్లు, రైతుబజార్లు తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. మూకుమ్మడిగా వ్యాపారాలు చేయొద్దని, సరిహద్దు జిల్లాలో కూడా కరోనా కేసులు నమోదుకావడంతో పోలీసు అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. విజయనగరం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, వన్ టౌన్ సీఐ ఎర్రంనాయుడు, టూటౌన్ సీఐ డి.శ్రీహరిరాజు, […]
సారథి న్యూస్, గోదావరిఖని: లాక్ డౌన్ నేపథ్యంలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులతో పాటు రెడ్ జోన్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనంతో పాటు ప్రోత్సాహకంగా రూ.8వేలు చెల్లించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక జ్యోతిభవన్ లో ఎన్టీపీసీ ఈడీ రాజ్ కుమార్ తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు ప్రకటించినట్లుగా ఎన్టీపీసీ నగదు ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు. ఆయన వెంట నగర మేయర్ డాక్టర్ బంగి […]
సారథి న్యూస్, వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రెండు వరి కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ జి.సైదులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ ధ్యేయమన్నారు. నాణ్యమైన పంటను తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. అకాలవర్షాలు కురుస్తున్న వేళ ధాన్యం నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. టార్ఫలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వరి ధాన్యంలో తేమశాతం 14 […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తున్న వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్(వీఆర్డీఎల్)ను శ్రీకాకుళం జిల్లా ప్రత్యేకాధికారి శశిభూషణ్ రావు, కలెక్టర్ జె.నివాస్ బుధవారం పరిశీలించారు. సిబ్బంది నియామక ప్రక్రియను కంప్లీట్ చేయాలని సూచించారు. ఇక్కడ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడంతో కరోనా పరీక్షల ఫలితాలను ఇక్కడే పొందవచ్చన్నారు. కాకినాడకు వెళ్లే అవసరం ఉండదన్నారు. అనంతరం జిల్లా కోవిడ్ ఆస్పత్రి జెమ్స్ ను పరిశీలించారు. ఎచ్చెర్ల శివానీ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్రంలోని […]
సారథి న్యూస్, అలంపూర్: కరోనా నివారణ చర్యల్లో భాగంగా బుధవారం అలంపూర్ మున్సిపాలిటీలో డ్రోన్ సాయంతో సోడియం హైపో ద్రావకాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్ మాట్లాడుతూ.. ప్రతివార్డులో 20 లీటర్ల చొప్పున పది వార్డులకు రెండొందల లీటర్ల ద్రావకాన్ని పిచికారీ చేయిస్తున్నట్టు వివరించారు. అందుకోసం రోజుకు రూ.20వేలు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్ సుష్మారావు, అల్లాబకాష్, సమీర్, గంగిరెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, మెదక్: కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడానికి రైస్ మిల్లర్లు అదనపు హమాలీలను సమకూర్చుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు. బుధవారం హవేలీ ఘనపురం మండల కేంద్రంతో పాటు రామాయంపేట మండలాల్లోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు తరలిస్తున్న ధాన్యం ఆయా మిల్లు వద్ద దిగుమతి కాకుండా అలాగే ఉంటునట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: నగరంలోని వివిధ ప్రాంతాల్లో మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం విసృతంగా పర్యటించారు. కాప్రా సర్కిల్ సాయిబాబా నగర్ కంటైన్ మెంట్ జోన్ లోని కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, డీసీ శైలజ, కార్పొరేటర్ స్వర్ణరాజ్ పాల్గొన్నారు. కవాడిగూడలో డ్రైనేజీ పనుల పరిశీలన.. మేయర్ సుడిగాలి పర్యటన రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డితో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ జవహర్ నగర్ డంపింగ్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ఆదేశాల ప్రకారం హైదరాబాద్ ను ట్రాఫిక్ రద్దీ రహితంగా తీర్చిదిద్దేందుకు రోడ్ల విస్తరణ, మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి రెండు వైపులా చేపట్టిన రోడ్ల విస్తరణలో కోల్పోతున్న ఆస్తులు, హోర్డింగ్స్, యూనిపోల్స్ ను తొలగించేందుకు సంబంధిత యజమానులు, చీఫ్ సిటీ ప్లానింగ్ అధికారి దేవేందర్ రెడ్డి, ఏసీపీలతో మేయర్ బుధవారం జీహెచ్ఎంసీ ఆఫీసులో చర్చించారు. రాకపోకలను […]