కూలి రూ.237గా నిర్ణయించిన కేంద్రం గతేడాది కంటే రూ.26 అదనంగా పెంపు సారథి న్యూస్, మెదక్: కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కూలీ కుటుంబాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారులు ఇటీవల అన్ని జిల్లాల్లో పనులు ప్రారంభించారు. కూలీలు పని ప్రదేశంలో సామాజిక దూరం పాటించేలా, అందరూ మాస్కు లు […]
సారథి న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికీ 1016 పాజిటివ్ కేసులు ఉండగా 24 గంటల్లో కొత్తగా 61 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. 6,928 మంది నుండి శాంపిళ్లను సేకరించినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కర్నూలు–14, గుంటూరు–3, అనంతపురం–5, తూర్పుగోదావరి–3, కృష్ణా–25, కడప–4, నెల్లూరు–4, కొత్తగా శ్రీకాకుళం జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 275, గుంటూరు జిల్లాలో 209 కేసులు నమోదయ్యాయి. […]
సారథి న్యూస్, నర్సాపూర్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను వణికిస్తున్న కరోనాను జయించాలంటే ప్రతిఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్వకుండా ఉండాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. బతికి ఉండాలంటే ప్రతిఒక్కరూ మూతులకు బట్ట కట్టాల్సిందేనని. లేదంటే ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉందని హెచ్చరించారు. శనివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం చిలిపిచెడ్ మండలంలోని 250 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, […]
సారథి న్యూస్, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్ పల్లి గ్రామం ఎర్రగుంటలో శనివారం ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్దకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెళ్లి చప్పట్ల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కానుగుల వెంకటయ్య మాట్లాడుతూ.. కరోనా వైరస్ ను అరికట్టడానికి ఉపాధి కూలీలకు మాస్కులు, శాన్ టైజర్లు పంపిణీ చేయకుండా వందమంది కూలీలతో ఒకే చోట పనిచేయించడం సరికాదన్నారు.లాక్ […]
సారథి న్యూస్, మెదక్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ ప్రక్రియను పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలకు సూచించారు. లాక్ డౌన్ అమలు, తీసుకుంటున్న చర్యలపై శనివారం ఆయన దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు, జిల్లాల కలెక్టర్ లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.నిత్యావసర సరుకుల కొరత, సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రం సమీపంలోని నాగనూల్ గ్రామంలో నాగర్ కర్నూల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతుల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని పీఏసీఎస్ అధికారులను ఆదేశించారు. రైతులు సామాజిక […]
శ్రీవారిని నిలదీస్తున్న కుబేరుడు.. ఎప్పటి మాదిరిగానే స్వామివారికి పవళింపు సేవ పూర్తయ్యింది. ఆలయం తలుపులను ఒకటికి పదిసార్లు చూసుకున్న అర్చకస్వాములు.. మళ్లీ సుప్రభాత సేవలో కలుద్దాం స్వామీ..అంటూ వెళ్లిపోయారు.. ఒంటరిగా ఉన్న వేంకటేశునికి..కంటిమీదకు కునుకు రావడం లేదు..అమ్మవార్లు కూడా ఇన్నేళ్లుగా అలసిపోయి ఉన్నారేమో వారూ..కాస్త దూరంగా నిద్రలోకి జారుకున్నారు… సరే తిరుమలలో పరిస్థితి ఏమిటో చూద్దామన్న కుతూహలం స్వామికి కలిగింది..అలా బంగారు వాకిలి వద్దకు దివ్యమార్గంలో వచ్చారు. అడవి కీచురాళ్ల శబ్దాలు..నిర్మల ప్రకృతి.. దూరంగా వారికి కేటాయించిన […]
రైతు, కూలీలకు ఇబ్బందులు రానివ్వం రెడ్ జోన్లపై నిఘా సారథి ప్రతినిధితో పెద్దపల్లి కలెక్టర్ సిక్తాపట్నాయక్ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. మన రాష్ట్రంలో మే 7 వరకు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలో లాక్ డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ సిక్తాపట్నాయక్ చెప్పారు. ఆ వివరాలు… సారథి: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో […]