Hero Raj Tarun’s girlfriend Lavanya has filed a case against him
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో ట్రెండింగ్ టాపిక్ సంచలనం రేపుతుంది, టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్‌పై
అతని ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్‌తో ప్రేమలో ఉన్నానని, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని లావణ్య ఆరోపించింది.
అయితే, రాజ్ తరుణ్ సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిణ్‌తో అఫైర్ పెట్టుకొని లావణ్యను వదిలివేశాడని ఆమె ఆరోపించింది. మూడు నెలల క్రితం రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయి లావణ్యకు దూరంగా ఉంటున్నాడని, తనను వదిలేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని కూడా లావణ్య తెలిపింది.
గతంలోనూ ఒక డ్రగ్స్ కేసులో తనను రాజ్ తరుణ్ కావాలనే ఇరికించాడని, ఆ కేసులో 45 రోజులు జైలులో ఉండవలసి వచ్చిందని లావణ్య ఆరోపించింది. ఆ సమయంలో రాజ్ తరుణ్ తనకు ఎలాంటి సాయం చేయలేదని కూడా ఆమె ఆరోపించింది.
లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ఈ కేసులో రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తారో చూడాలి
Hero Raj Tarun’s girlfriend Lavanya has filed a case against him.
One thought on “టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై సంచలన ఆరోపణలు!”
Comments are closed.