Venkatesh Anil Ravipudi new movie
‘ఎఫ్2’, ‘ఎఫ్3’ చిత్రాలతో మనకు వినోదాన్ని పంచిన సక్సెస్ ఫుల్ జంట వెంకటేష్, అనిల్ రావిపూడి మూడోసారి సరికొత్త చిత్రంతో జతకట్టనున్నారు. ఈ చిత్రం దిల్ రాజు సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మాణంలో బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, డి.సురేశ్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ అందించారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైన్: ఎ.ఎస్. ప్రకాశ్, కూర్పు: తమ్మిరాజు, యాక్షన్ డైరెక్టర్:వి.వెంకట్. వెంకటేష్ సరసన కథానాయికలుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నారు. ఇది “కథానాయకుడు, ఆయన భార్య, ఆయన మాజీ ప్రియురాలు ఈ మూడు పాత్రల చుట్టూ సాగే నేర నేపథ్యమున్న కథ అని ప్రేక్షకుల్ని అలరిస్తుందని అనిల్ చెప్పారు.