Rashmika Mandanna’s Action-Packed First Look in “Kubera”
తెలుగు తెరపై త్వరలో రాబోతున్న కొత్త సినిమా “కుబేర”. ధనుష్, అక్కినేని నాగార్జున వంటి స్టార్ హీరోల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మండన్న కథానాయికగా నటిస్తుండగా, జిమ్ సర్బ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమా సోషల్ డ్రామా అంశాలతో రూపొందుతోంది అని తెలుస్తోంది. కానీ, ఇప్పటి వరకు కథ గురించి అధికారిక సమాచారం లేదు. ఇది డిసెంబర్ 31, 2024న విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌లో డబ్బు సంచులు తవ్వే రష్మిక కనిపించడం ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. కథలో ఆమె పాత్ర చాలా కీలకమని, ఇద్దరు హీరోల మధ్య వారధిలా ఉంటుందని అంచనాలున్నాయి. మరో విశేషం ఏమిటంటే, ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం. ట్రైలర్ విడుదలైన తరువాత మాత్రమే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై సంచలన ఆరోపణలు!