Varalaxmi Sarathkumar Marriage
14 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న జంట వరలక్ష్మి శరత్ కుమార్, నికోలయ్ సచిదేవ్‌లు జులై 2న థాయిలాండ్ వేదికగా వివాహ బంధంతో ఒకటయ్యారు. 2024 మార్చిలో వీరి నిశ్చితార్థం అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన రిసెప్షన్‌కు పలువురు సినీ నటులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విచ్చేసి జంటకు శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ, వెంకటేష్, రజనీకాంత్, శోభన, రోజ, సిద్ధార్థ వంటి పలువురు నటులు రిసెప్షన్‌లో సందడి చేశారు. వరుడు నికోలయ్ సచిదేవ్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త ఈయన ఒక ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్నారు. ఆన్లైన్ వేదికగా వివిధ రకాల కళాకృతులు, పెయింటింగ్‌లు విక్రయిస్తూ ఉంటారు. ఇప్పుడు వీరి రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.