సారథి న్యూస్, హుస్నాబాద్: పర్మిషన్ లేకుండా ఇండోర్ స్టేడియం కూల్చేస్తారా? అని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ ప్రశ్నించారు. హుస్నాబాద్ పట్టణంలో శివాజీ నగర్ బురుజు పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.20లక్షల వ్యయంతో ఈ ప్రాంత క్రీడాకారులకు ఇండోర్ స్టేడియం ఏర్పాటుచేశారని తెలిపారు. ప్రభుత్వాలు మారడంతో ఇండోర్ స్టేడియానికి ప్రత్యేకంగా నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు. గత మున్సిపల్ పాలకవర్గం తీసుకున్న నిర్ణయంపై నూతన పాలకవర్గంలో కనీసం చేర్చించకుండా, కనీసం […]
బల్లూనాయక్ తండాలో విషాదం సారథి న్యూస్, హుస్నాబాద్: బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ పైనపడి ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లూనాయక్ తండాలో గురువారం చోటుచేసుకుంది. హుస్నాబాద్ ఎస్సై ఎస్. శ్రీధర్ కథనం మేరకు.. ఇదే తండాకు చెందిన లావుడ్య దుర్గ, దేవోజికి సంబంధించిన వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు క్రేన్ విరిగి బావిలో పడిపోయింది. దీంతో బావిలో పనిచేస్తున్న నలుగురి మీద క్రేన్ పడి లావుడ్య […]
సారథి న్యూస్, హుస్నాబాద్: యువతకు క్రీడలు చాలా అవసరమని, గ్రామీణ ఆటలు బాగా ఆడించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్ రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన కోహెడలో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడలను మంత్రి హరీశ్ రావు బుధవారం వీక్షించారు. ఈ మేరకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ బౌలింగ్ చేయగా, మంత్రి బ్యాటింగ్ చేస్తూ.. వినూత్నరీతిలో షాట్లు కొట్టి అక్కడి వారందరినీ అలరించారు. ఈ […]
అవగాహన కల్పించేందుకు సిద్దిపేటలో హాఫ్ మారథాన్ రన్నింగ్ పోటీలను ప్రారంభించిన సిద్దిపేట సీపీ డి.జోయల్ డేవిస్, ఎమ్మెల్యే సతీశ్ కుమార్ సారథి న్యూస్, హుస్నాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ పిలుపునిచ్చారు. 32వ రోజు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా హుస్నాబాద్ లో జిల్లాస్థాయి హాఫ్ మారథాన్ రన్నింగ్ పోటీలు నిర్వహించారు. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి ఉత్సాహవంతులైన యువతీ యువకులు పాల్గొన్నారు. […]
సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ అకౌంట్ ను సైబర్ నేరస్తులు హ్యాక్ చేశారని ఎస్సై ఎస్.శ్రీధర్ సోమవారం విలేకరులకు తెలిపారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పలు అసత్యపు ప్రచారాలు, నేరాలను అదుపు చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫేస్ బుక్ అకౌంట్ తెరిచామన్నారు. గుర్తుతెలియని సైబర్ నేరస్తులు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ ను హ్యాక్‌చేసి, డూప్లికేట్ ఫేస్ […]
సినీనటుడికి గుడి కట్టిన వీరాభిమాని సిద్దిపేట జిల్లా చెలిమితండాలో విగ్రహావిష్కరణ సారథి న్యూస్, హుస్నాబాద్: సాధారణంగా దేవుళ్లకు గుళ్లుగోపురాలు కడుతుంటారు.. కానీ ఓ మనిషిలో దేవుడిని చూసి.. ఆ మనిషికే గుడి కట్టాడు ఓ అభిమాని. దైవంగా భావించి ఆ ఊరులో పూజలు అందుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో కాదు సుప్రసిద్ధ బాలీవుడ్ సోనూసూద్. సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించినప్పటికీ ఆయన ఇప్పుడు అందరి దృష్టిలో హీరో అయ్యాడు. లాక్డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్న పేదలందరికీ విశేషమైన […]
సారథి న్యూస్, హుస్నాబాద్: పాత వాహనాలను వేలం పాట వేయనున్నట్లు ఏసీపీ సందెపోగు మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ ఉన్నతాధికారులు తనిఖీల్లో అబాండెడ్ మోటర్ సైకిల్ అండ్ స్కూటర్లు 35, మహేంద్ర ట్రాక్టర్ ఒకటి, ఒక మారుతి కారు, ఒక టాటా ఏస్ ఆటో.. ఇలా మొత్తం 38 వెహికిల్స్ పట్టుబడినట్లు తెలిపారు. వాటి యజమానులు ముందుకు రాకపోవడంతో వాటిని(అన్నోన్ ప్రాపర్టీ) కింద పరిగణించి ఈనెల […]
సారథి న్యూస్, హుస్నాబాద్: దివ్యాంగులైన ఇద్దరు దంపతులకు ఓ పోలీసు అధికారి తన సొంతఖర్చులతో మరుదొడ్లను కట్టించి మానవతా హృదయం చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బొజ్జ సంతోష, భర్త కొమురయ్య దంపతులు దివ్యాంగులు. వారి ఆలాన పాలన చూసుకోవడానికి సంతానం కూడా లేకపోవడంతో ప్రతిరోజు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆ దంపతులు పడుతున్న అవస్థలు అన్నీఇన్ని కావు. వారి ఇబ్బందులను స్వయంగా చూసి చలించిపోయిన అక్కన్నపేట ఎస్సై కొత్తపల్లి […]