సారథి న్యూస్, సత్తుపల్లి : కరోనా విపత్తువేళ.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గొప్పమనసు చాటుకున్నారు. తన నియోజకవర్గంలో కరోనాతో బాధపడుతున్న రోగులకు తనవంతుగా రూ.500 ఆర్థికసాయం, కూరగాయలు, నిత్యవసరాలు అందజేశారు. ( 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కేజీ మంచినూనె, ఉల్లిపాయలు, ఉప్మారవ్వ, కారం, పసుపు, ఉప్పు, పంచదార, సబ్బులు, కూరగాయలు, 30 కోడిగుడ్లు) కరోనా వ్యాధిసోకిన నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే సాయం చేసినట్టు చెప్పారు. కరోనా పట్ల ఎవరూ ఆందోళన […]
సారథి న్యూస్, ఖమ్మం: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటుచేసిన సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ప్రజాపక్షపాతిగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరి రావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, ఎంపీడీవో రవీంద్రారెడ్డి, సర్పంచుల సంఘం […]
సారథిన్యూస్, సత్తుపల్లి: ప్రజలంతా మట్టిగణపతినే పూజించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. శుక్రవారం ఆయన మాధురి మెడికల్స్ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టిగణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకోవడం మానవ ధర్మం, పర్యావరణ పరిరక్షణకు గాను ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలన్నారు.
సారథి న్యూస్, ఖమ్మం: భారత్-చైనా సరిహద్దులో గల గాల్వన్ లోయలో ఇరుదేశాల సైనికుల ఘర్షణలో వీరమరణం చెందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి కల్నల్ సంతోష్ బాబుకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గురువారం సత్తుపల్లిలో కొవ్వొత్తిని వెలిగించి నివాళులు అర్పించారు. వీర మరణం చెందిన సంతోష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.
సారథి న్యూస్, రామడుగు/ఖమ్మం: చైనా శత్రు మూకల దాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు రామడుగులోని అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యావంతులవేదిక ఆధ్వర్యంలో గురువారం కొవ్వత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో అమర జవాన్లకు నివాళి అర్పించారు.
సారథి న్యూస్, మెదక్, చేవెళ్ల: కరోనా(కోవిడ్ –19) వ్యాప్తి నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. బయటికి కదిలాయి. ప్రభుత్వం కంటైన్ మెంట్ ఏరియాలు మినహా అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్ లుగా ప్రకటించడంతో ప్రజారవాణా మొదలైంది. కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో మార్చి 22 నుంచి ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి […]