సారథి న్యూస్, వాజేడు: పస్రా ఫారెస్ట్రేంజ్ పరిధిలో ఉన్న చల్వాయి నర్సరీ కేంద్రాన్ని గురువారం ములుగు డీఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి ఆకస్మిక తనిఖీ చేశారు. నర్సరీలో ఉన్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకుని కొన్ని సూచనలు చేశారు. అనంతరం లక్నవరంలోని ఎకో పార్క్ ను సందర్శించిన డీఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి సిబ్బందిని ఫుడ్ కోర్ట్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అలాగే పర్యాటకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం లక్నవరంలోని వాచ్ టవర్ […]
సారథి న్యూస్, వాజేడు, తాడ్వాయి: ప్రమాదవశాత్తు జంపన్నవాగులో పడి బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గ్రామంలో బుధవారం విషాదం నింపింది. మేడారం గ్రామానికి చెందిన మహేందర్, యాద లక్ష్మిల కుమారుడు పల్లపు తరుణ్(14) బుధవారం బంధువుల పిల్లలతో కలిసి జంపన్న వాగు అవతల ఉన్న కొత్తూరు గ్రామానికి వెళ్లి తిరిగివస్తుండగా కొంగల మడుగు వద్ద గల లోవెల్ బ్రిడ్జిపై దాటుతుండగా ప్రవాహం పెరిగి వాగులో పడిపోయాడు. ఈత రాకపోవడం వల్ల […]
ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య సారథి న్యూస్, ములుగు: మహాత్మాగాంధీ మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగు జాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. శుక్రవారం మహాత్మాగాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ లో గాంధీజీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక రుగ్మతలు లేకుండా దేశం అభివృద్ధిపథంలో నడిపేందుకు కృషిచేసిన గాంధీజీ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు ఇచ్చిన ఘనమైన […]
ములుగు జిల్లాలో టూరిస్టు ప్రదేశాలకు అనుమతి కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి: డీఎఫ్ వో సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో ఉన్న ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలైన బొగత వాటర్ ఫాల్స్, తాడ్వాయి హాట్స్, లక్నవరం ఎకో పార్కుల్లో పర్యాటకులను అక్టోబర్ 1వ తేదీ నుంచి అనుమతించనున్నట్లు డీఎఫ్వో ప్రదీప్ కుమార్ శెట్టి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పర్యాటకులు తప్పనిసరిగా మాస్కు పెట్టుకుని, శానిటైజర్ వెంట తీసుకురావాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించి, […]
సారథి న్యూస్, వాజేడు: వానాకాలంలో నిల్వ ఉన్న నీటితో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు శుక్రవారం ములుగు జిల్లా వాజేడు మండలం మూరుమూరు పంచాయతీలో ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ పూసం నరేష్, హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, శేఖర్, కన్యాకుమారి, ఛాయాదేవి, లలిత కుమారి, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా పేరూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని టేకులగూడెంలో డాక్టర్ సీతారామరాజు ఆధ్వర్యంలో శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 61మందికి వైద్యపరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వ్యాధి నిర్ధారణ టెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఫార్మసిస్ట్ యాలం సతీశ్, హెల్త్ అసిస్టెంట్ కె.తిరుపతి రావు, ఎస్ఎన్ఎం జి.రజిత, ఎల్టీకే.అశ్విని, సర్పంచ్ వాసం కృష్ణవేణి, కార్యదర్శి యాలం వినోద పాల్గొన్నారు.
సారథి న్యూస్, వాజేడు(ములుగు): మహిళలు స్వశక్తితో ఎదగాలని సర్వర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ములుగు, భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. తస్లీమా చిన్నకుమారుడు సుహాన్ పుట్టినరోజు కానుకగా బుధవారం నిరుపేద మహిళ సంగి ఉమకు కుట్టు మిషన్ అందించి దాతృత్వం చాటుకున్నారు. కరోనా సమయంలో ఏదైనా వేడుకలు చేసుకోలేకపోతున్న వారు పేదలకు ఏదైనా దానం చేసి దాతృత్వం చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణ, డాక్టర్సంతోష్, సర్వర్ ఫౌండేషన్ సభ్యులు మామిడిపల్లి రమేష్, చంటి శామ్యూల్, అస్మా, […]
సారథి న్యూస్, ములుగు: సఖి కేంద్రాలు మహిళలు, బాలికలకు అండగా నిలవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య సూచించారు. మంగళవారం ములుగు జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో సఖి జిల్లా నిర్వహణ కమిటీ, జిల్లా బాలసంరక్షణ సొసైటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహహింస, లైంగిక హింసలను ఎదుర్కొనే మహిళలు, బాలికలకు రక్షణ, న్యాయ, వైద్య సహాయాలు అందుతాయని అన్నారు. జిల్లాలో మార్చి 8న సఖి కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో […]