Breaking News

మిర్చి

అమాంతం పెరిగిన మిర్చి, పత్తి ధరలు

అమాంతం పెరిగిన మిర్చి, పత్తి ధరలు

సామాజిక సారథి, వరంగల్: వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చి ధర మంగళవారం పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రూ.18వేలు పలికిన వండర్ హాట్  మంగళవారం రూ.18500, 341 రకం 17500, తేజ రకం రూ.15400 ఉన్నట్టు అధికారులు  తెలిపారు.  మార్కెట్లో    పత్తికూడా రికార్డు ధర పలికింది. రూ.8715 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. సీజన్ లో పత్తి ధర ఈ విధంగా పలకడం ఇదే మొదటిసారి కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Read More
మిర్చికి వైరస్‌ దెబ్బ

మిర్చికి వైరస్‌ దెబ్బ

సామాజిక సారథి‌, ఏన్కూరు: రైతులు సాగు చేసిన మిరప తోటలపై తామర పురుగు తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంది. దీంతో పంట దెబ్బతిని రైతులు లబోదిబోమంటున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో మిరప సాగు చేశారు. ఆశించిన ధర ఉండటంతో చాలా మంది రైతులు మిరప సాగుపై ఎక్కువ ఆసక్తి కనపర్చారు. మండలంలో గత ఏడాది కేవలం ఐదువేల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా ఈ ఏడాది సుమారు […]

Read More
మిర్చి పంటను పరిశీలించిన అధికారులు

మిర్చి తోటలను పరిశీలించిన అధికారులు

సామాజిక సారథి‌, వైరా: ఖమ్మం జిల్లా వైరా మండలంలోని పాలడుగు,  రెబ్బవరం, గొల్లపూడి గ్రామాల్లో వైరస్ సోకిన మిర్చి తోటలను శనివారం ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మిర్చి తోటలకు తామరపురుగు తెగులు ఆశిస్తున్నట్లు గుర్తించారు. దీని నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారిణి అపర్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్, ఏఈవోలు వెంకట్ నర్సయ్య, వాసంతి కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Read More
రైతులకు సేవలందించడంలో విఫలం

రైతులకు సేవలందించడంలో విఫలం

సామాజిక సారథి‌, వైరా: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు, సేవలందించడంలో ఉద్యానవన శాఖ విఫలమైందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు ఆరోపించారు. వైరా మండలంలోని పలు గ్రామాల్లో రైతు సంఘం బృందం వైరస్ సోకిన మిర్చి తోటలను గురువారం పరిశీలించింది. పలువురు రైతులు వైరస్ తో దెబ్బతిన్న మిర్చి తోటలను ఈ బృందానికి చూపించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ మిర్చి సాగులో 50శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, […]

Read More
మిర్చి రైతులకు న్యాయం చేయండి

మిర్చి రైతులకు న్యాయం చేయండి

సారథి న్యూస్, కర్నూలు: రైతులకు నాసిరకం మిరప మొక్కలను సరఫరా చేసిన నర్సరీ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి నుంచే నష్టపరిహారం రాబట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ అధికారులను డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట మిర్చి రైతులకు నర్సరీ యాజమాన్యం నష్టపరిహారం ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. రామళ్లకోట గ్రామంలో సుమారు వెయ్యి ఎకరాల్లో మిరప పంటవేశారు. స్థానిక వీఎన్ఆర్​కంపెనీ నుంచి విత్తనాలు తెచ్చి నర్సరీ […]

Read More