ఫలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ సంధర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని మంత్రి దయాకర్‌రావు పుష్పగుచ్ఛం […]
సామాజిక సారథి, మహబూబాబాద్: తక్కలపల్లి రవీందర్ రావుకు ఎమ్మెల్సీ పదవి రావడంతో ఆయన అనుచరులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం అనుచరుడు పుచ్చకాయల రామకృష్ణ మాట్లాడుతూ మానుకోట ముద్దుబిడ్డ, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు రవీందర్ రావు ఎమ్మెల్సీ పదవి రావడం సంతోషకరమన్నారు. రవీందర్ రావుకు ఎమ్మెల్సీ పదవొస్తే అనంతాద్రి వెంకటేశ్వర స్వామి వారికి 101కొబ్బరి కాయలతో మొక్కు చెల్లించుకుంటామని మొక్కినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ వచ్చిన సందర్భంగా 101 కొబ్బరికాయలు కొట్టి, మొక్కులు చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు. […]
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయకుండా బీజేపీ, కేంద్రాన్ని ప్రశ్నించకుండా కాంగ్రెస్ రైతులను మోసం చేస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాంబారి సమ్మరావు తో కలిసి మంత్రి హన్మకొండలోని తన […]
సామాజిక సారథి, రాయపర్తి/వరంగల్: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో వానాకాలం సీజన్ లో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసి డబ్బు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యాపారి గొలుసుల కుమార్ ను బుధవారం రాయపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. కాట్రపల్లి గ్రామంలో రైతుల పంటను కొనుగోలు చేసి కొంతమంది రైతులకు డబ్బు ఇవ్వకుండా రైతులను మోసం చేసినట్లు రైతుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు […]
సామాజిక సారథి, వరంగల్: వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ గా పి.ప్రావీణ్య శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. విభాగాల వారీగా అధికారులతో పరిచయం చేసుకున్న ఆమె మాట్లాడుతూ.. జీడబ్ల్యూఎంసీ పరిధిలో వివిధ పథకాల కింద ఆయా విభాగాల ద్వారా కొనసాగుతున్న, పెండింగ్ లో ఉన్న, చేపట్టబోయే అభివృద్ధి పనుల సమాచారం అందుబాటులో ఉండాలని సూచించారు. కమిషనర్ గా పి.ప్రావీణ్యకు అదనపు కమిషనర్ సీహెచ్.నాగేశ్వర్, ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ వో డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్ఓ సునీత, […]
సారథి న్యూస్, ములుగు: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా ఎన్నికల అధికారులకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రెండవ విడత ట్రైనింగ్ ఇచ్చారు. రెవెన్యూ డివిజనల్ అధికారి, సహాయ ఎన్నికల అధికారి కె.రమాదేవి మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్స్, పెద్ద బ్యాలెట్ బాక్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ డ్యూటీని జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ములుగు తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, డీఏవో శ్రీనివాస్, […]
సారథి న్యూస్, ములుగు: జిల్లాలోని ఎస్టీయూ భవన్ లో జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పర్వతరెడ్డి హాజరయ్యారు. దేశంలో స్త్రీని శక్తి స్వరూపిణిగా కొనియాడే సంప్రదాయం ఉందని, అయినా మహిళలు వివక్షకు గురవుతున్నారని అన్నారు. తల్లిగా, చెల్లిగా, భార్యగా అందించే సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం జిల్లాలో పనిచేస్తున్న ఆరుగురు ఉపాధ్యాయినులు సుమలత, సునిత, సుధారాణి, లవనిక, లలిత, రాజేశ్వరిని అవార్డులతో సత్కరించారు. […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో గురువారం భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె ప్రభుత్వ జూనియర్ కాలేజీ, హైస్కూల్, హాస్పిటల్, తహసీల్దార్, ఎంఈవో, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్లను సందర్శించి ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట వాజేడు మండల […]