సామాజిక సారథి, పెద్దశంకరంపేట: ప్రజలంతా శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ అన్నారు. ఆదివారం పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ లో ఎంపీపీ జంగం శ్రీనివాస్ అధ్యక్షతన అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు గణేష్ మండపాల నిర్వాహకులతో నిర్వహించిన శాంతి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10న వినాయకచవితి పండుగను పురస్కరించుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని, అందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. […]
సారథి, మానవపాడు: వచ్చే బక్రీద్, వినాయక చవితి పండుగలను ఎవరికి ఇబ్బంది కలిగించకుండా జరుపుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఎస్సై సంతోష్ సూచించారు. ఆదివారం మానవపాడు పోలీస్స్టేషన్ ఆవరణలో ముస్లిం పెద్దలు, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు, యువకులతో శాంతిసమావేశం నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా అందరం కలిసి పండుగలను జరుపుకుందామని పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా ప్రార్థన స్థలాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించాలని కోరారు. సోషల్ […]
సారథి న్యూస్, కర్నూలు: వినాయక చవితి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప, జేసీలు రవి పట్టన్ షెట్టి, రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్19 నిబంధనలను అనుసరించి జిల్లా ప్రజలంతా ప్రకృతిని, సంస్కృతిని, పర్యావరణాన్ని సమతుల్యం చేస్తూ మట్టి గణపతులను ఇంట్లోనే పెట్టుకుని సంతోషంగా పండుగ […]
సారథి న్యూస్, మెదక్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషిచేయాలని, ఇళ్లు, మండపాల వద్ద మట్టితో తయారుచేసిన ప్రతిమలను ప్రతిష్టించాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. మట్టితో తయారుచేసిన వినాయక ప్రతిమలను శుక్రవారం మెదక్ మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ చంద్రపాల్ తో కలిసి పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించుకోవాలని సూచించారు. సామూహిక పూజలు, ప్రార్థనలు, ఊరేగింపుల వల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి […]