హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఆర్డీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ ఆర్డీవోగా ఎస్.మోహన్‌రావు నియమితులయ్యారు. అలాగే ఎల్లారెడ్డి ఆర్డీవోగా ఎస్.శ్రీను, ఆందోల్-జోగిపేట ఆర్డీవోగా వి.విక్టర్, వనపర్తి ఆర్డీవోగా పి.అమరేందర్, నిర్మల్ ఆర్డీవోగా రాథోడ్ రమేష్, బాన్స్ వాడ ఆర్డీవోగా బి.రాజాగౌడ్, మేడ్చల్-మల్కాజ్‌గిరి ఎస్డీసీగా జి.లింగ్యానాయక్ నియమితులయ్యారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. అడిషనల్ సీఈవోగా జ్యోతి బుద్ధప్రకాష్, వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సయ్యద్ అలీ ముర్తుజారజీ, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్ గా అదర్ సిన్హా, నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా ఎల్.శర్మన్, పాఠశాల విద్యాడైరెక్టర్‌గా శ్రీదేవసేన, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ గా వాకాటి కరుణ, పర్యాటక, […]
సారథిన్యూస్, రామగుండం: సింగరేణి యాజమాన్యం ఇష్టానుసారం కార్మికులను బదిలీ చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. అక్రమ బదిలీలను వెంటనే ఆపకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఆర్జీవన్ డివిజన్లోని జీకే ఓకటో గని కార్మికులను యాజమాన్యం ఎందుకు బదిలీ చేస్తున్నదని ప్రశ్నించారు. శనివారం ఆయన కార్మికులను కలిశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఒకటో గనిలో కార్మికులు అవసరం ఉన్నప్పటికీ యజమాన్యం పద్ధతి లేకుండా కార్మికులను అడ్డాయలప్రాజెక్టుకు ఆర్జీ3కి బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. […]