దెబ్బతిన్న శ్రీవారి మెట్ల మార్గం పునరుద్ధరణ పనులు పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రిలో సూపర్‌స్పెషాలిటీ సేవలు చైర్మన్వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి కొన్ని, అభివృద్ధి పనులకు సంబంధించి మరికొన్ని ఉన్నాయి. ఇటీవల భారీవర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గంలో రూ.3.6 కోట్ల వ్యయంతో, రెండో ఘాట్ […]
మోహినీ అవతారంలో అమ్మవారు దర్శనం తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలుమంగ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం ఏకాంతంగా నిర్వహించారు. అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది.
కార్తీక దీపోత్సవానికి వచ్చి గుండెపోటుతో హఠాన్మరణం సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం స్వామి సేవలో జీవితం అంకితం చేశారు: సుప్రీం సీజేసీ జస్టిస్ఎన్వీ రమణ తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. కార్తిక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్లిన ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రాగా, దవాఖానకు తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. డాలర్ శేషాద్రి 1978 నుంచి శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు. […]