Breaking News

TELANGANA

‘ఉస్మానియా’ పురావస్తు భవనం కాదా?

సారథి న్యూస్, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరంలో ప్రఖ్యాత ఉస్మానియా ఆస్పత్రి కొత్త నిర్మాణం, కూల్చివేతపై దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు విచారించింది. ఆస్పత్రి కూల్చివేతపై భిన్నవాదనలు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కూల్చివేయాలని ఓ వాదన.. పురాతన భవనమని మరో వాదన ఉందని వ్యాఖ్యానించింది. ఉస్మానియా ఆస్పత్రి పురావస్తు భవనమా? కాదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఈ ఆస్పత్రి మరమ్మతుల కోసం గతంలోనే రూ.6కోట్లు కేటాయించినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అలాగే, మరమ్మతుల పనుల పురోగతిని […]

Read More

డీటీలకు పోస్టింగులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: గ్రూప్‌-2లో ఎంపికైన డిప్యూటీ తహసీల్దార్లకు (ప్రొబెషనరీ డిప్యూటీ తహసీల్దార్లు/డీటీలు) పోస్టింగ్‌లపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 259 మంది ఎంపిక కాగా 257 మంది మాత్రమే జాయినింగ్‌ ఆర్డర్లు సమర్పించారు. వీరిని రెండ్రోజుల్లో విధుల్లోకి తీసుకోవాలంటూ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఆదేశించారు. 2016లో ఎంపికైన వీరికి గతేడాది నవంబరులో ప్రభుత్వం అపాయింటుమెంట్లు కల్పించింది. పోస్టింగ్‌ల కోసం వీరంతా ఎదురుచూస్తున్నారు. దీనిపై స్పందించిన  ప్రభుత్వ ప్రధాన […]

Read More
మావోయిస్టు కరపత్రాల కలకలం

మావోయిస్టు కరపత్రాల కలకలం

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వెంకటాపురం(నుగూరు) మండలంలోని సూరవీడు కాలనీ వద్ద బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్లే రహదారిపై మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. దీనితో వచ్చిపోయే ప్రయాణికులు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ‘కరోనాతో ప్రాణాపాయస్థితిలో ఉన్న వరవరరావు, వికలాంగుడైన ప్రొఫెసర్​ సాయిబాబాతో పాటు 12 మందిని ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని, ఉఫా, ఎన్ఐఏ కేసులను ఎత్తివేయాలని, అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించాలని, జులై 25న తెలంగాణ […]

Read More
1,554 కేసులు.. 9 మరణాలు

1,554 కేసులు.. 9 మరణాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో బుధవారం 1,554 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా మొత్తంగా రాష్ట్రంలో 49,259కు కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రికవరీ అయిన కేసులు 37,666 కేసులు నమోదయ్యాయి. తాజాగా 9 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 429 మరణాలు సంభవించాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్​ఎంసీ 842 కేసులు అత్యధికంగా నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి 132, మేడ్చల్​ 96, సంగారెడ్డి 24, ఖమ్మం 22, కామారెడ్డి 22, వరంగల్​ అర్బన్​ […]

Read More

పేదలకు కార్పొరేట్​ విద్య

సారథిన్యూస్​, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో పేదవిద్యార్థులకు కార్పొరేట్ స్ఠాయి విద్య అందుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఖమ్మం నగరంలోని ఇందిరానగర్​లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పాఠశాల విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డీఈవో మదన్ మోహన్, కార్పొరేటర్ చావా నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఉద్యమకారులను అవమానించొద్దు

సారథిన్యూస్​, కొత్తగూడెం: తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలను అవమానించొద్దని భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్నీ) పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగూడెంలో ఉద్యమకారుల స్థూపాన్ని శ్మశానవాటిక అయిన ప్రగతి మైదానంలో నిర్మించడమేమిటని ప్రశ్నించారు. పాత అమరవీరుల స్థూపం ఉన్నచోట కొత్త స్థూపాన్ని నిర్మించాలని డిమాండ్​ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Read More
దాశరథికి ఘన నివాళి

దాశరథికి ఘన నివాళి

సారథి న్యూస్​, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం తెలంగాణ సాహితీ సౌరభం దాశరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనస్తామన్నారు.

Read More
హైకోర్టు వ్యాఖ్యలు బాధేశాయి

హైకోర్టు వ్యాఖ్యలు బాధేశాయి

కరోనా నివారణకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తోంది తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉంది సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా విషయంలో ఎవరుపడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని, కోర్టు ఇప్పటికీ 87 పిల్స్ ను స్వీకరించిందని, నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతోందని, ఈ క్లిష్టసమయంలో చేయాల్సిన పనులను వదిలిపెట్టి కోర్టుకు తిరగడం, విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతోందని, దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అన్నారు. […]

Read More