Breaking News

TELANGANA

మోతె రిజర్వాయర్​కు మోక్షం

సారథి న్యూస్, రామడుగు: మోతె రిజర్వాయర్​కు ఎట్టకేలకు అనుమతి లభించింది. పనులు వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్​ తెలిపారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలో నిర్మిస్తున్న మోతె రిజర్వాయర్​కు గతేడాది జూన్​లో టెండర్లు పిలిచారు. త్వరలోనే పనులను ప్రారంభించనున్నారు. రూ.180కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. రామడుగు, గంగాధర చొప్పదండి మండలాల్లో దాదాపు 30వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే రవిశంకర్​ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక […]

Read More

బండరపల్లి చెక్​డ్యాంకు జలకళ

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండర్​పల్లి చెక్​డ్యాం అలుగు పారుతోంది. బండర్​పల్లి వంతెనను గతేడాది మంత్రి టి.హరీశ్​రావు చొరవతో చెక్​డ్యాంగా నిర్మించారు. కాగా, కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పెద్దఎత్తున నీరు చేరి అలుగు పారుతోంది. చెక్ డ్యాం నిండడంతో పరిసర గ్రామల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్​డ్యాంకు నిధులు మంజూరు చేసిన మంత్రి టి.హరీశ్​రావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Read More
ప్రగతి భవన్ లోనే పంద్రాగస్టు వేడుకలు

ప్రగతిభవన్​లోనే పంద్రాగస్టు వేడుకలు

సారథి న్యూస్, హైదరాబాద్: ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో కాకుండా ప్రగతి భవన్ లోనే జరగనున్నాయి. ఇక్కడే సీఎం కె.చంద్రశేఖర్​రావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి వేడుకలను ప్రగతి భవన్ కే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఏటా గోల్కొండ కోటలో పంద్రాగస్టు సంబరాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 15న ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి […]

Read More
రైల్వేకోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకే తలమానికం

రైల్వేకోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకే తలమానికం

సారథి న్యూస్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి కొండకల్ వద్ద ఉన్న 100 ఎకరాల్లో రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ జిల్లాకే కాక తెలంగాణకే తలమానికం అని పేర్కొన్నారు. అనంతరం శంకర్ పల్లి మండలంలోని మొకీల చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను మంత్రి ఎగరవేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, సబితా […]

Read More
దిగొచ్చిన గోల్డ్ రేటు

దిగొచ్చిన గోల్డ్ రేటు

సారథి న్యూస్​, హైదరాబాద్: దేశంలో బంగారం ధరలు కొన్ని రోజులుగా పైపైకి అందకుండాపోతున్న విషయం తెలిసిందే. అయితే గురువారం మాత్రం భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్​ లో తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3,350 క్షీణించడంతో రూ. 54,680కు పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,010 తగ్గడంతో రూ.50,130కు చేరింది. అటు కేజీ వెండి ధర రూ.50 పెరగడంతో రూ.72,550కు చేరింది. ఇలా రెండు, మూడు రోజులుగా గోల్డ్ ధరలు […]

Read More
విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు

విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు

హైదరాబాద్​: సోషల్‌ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తిచేశారు. సోషల్ మీడియాలో తప్పడు పోస్టులు బెంగళూరులో ఎంత విద్వేషానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తినష్టానికి కారణమైందో తెలుసుకోవాలని కోరారు. శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టొద్దని సూచించారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తున్నారని, అలాంటి వారిపై వెంటనే కేసులు పెట్టి, కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. […]

Read More
తెలంగాణలో 1,931కరోనా కేసులు

తెలంగాణలో 1,931 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,931 కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధిబారినపడి తాజాగా 11 మంది మృతిచెందారు. అయితే మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 665 మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 86,475 కేసుల నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఒకేరోజు 293 కేసులు నిర్ధారణ అయ్యాయి. 24 గంటల్లో 1,780 మంది కరోనా నుంచి రికవరీ అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం యాక్టివ్​కేసులు 22,736 ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. వరంగల్ అర్బన్ […]

Read More

చిన్నశంకరంపేటలో రెండు కేసులు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలో బుధవారం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్​ శ్రావణి తెలిపారు. మొత్తం 11 మందికి టెస్టులు నిర్వహించగా వారిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మాస్కులు ధరించి బయటకు రావాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి టెస్టులు చేసుకోవాలన్నారు.

Read More