Breaking News

TELANGANA

తెలంగాణలో 2,734 కరోనా కేసులు

తెలంగాణలో 2,734 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది. మంగళవారం(24 గంటల్లో) రాష్ట్రంలో 2,734 పాజిటివ్​ కేసుల నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,27,697 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 9 మృత్యువాతపడగా, ఇప్పటివరకు మరణాల సంఖ్య 836కు చేరింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 31,699గా నమోదైంది. కాగా, గత 24 గంటల్లో 38,351 శాంపిల్స్ కలెక్ట్ చేశారు. మరో 878 పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం హోంఐసోలేషన్ లో 24,598 మంది ఉన్నారు. […]

Read More
కార్పొరేట్​కు దీటుగా ఆన్​లైన్​ క్లాసెస్​

కార్పొరేట్​కు దీటుగా ఆన్​లైన్​ క్లాసెస్​

సారథి న్యూస్, మెదక్: విద్యార్థులు చదువు, విద్యాసంవత్సరాన్ని నష్టపోకుండా ఉండేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు చెప్పారు. ఆన్​లైన్​ క్లాసెస్​ను ప్రతి విద్యార్థి వినేలా చొరవ తీసుకోవాలని సూచించారు. మంగళవారం నుంచి రాష్ట్రంలో సర్కారు స్కూళ్లలో ప్రత్యేక ఆన్​లైన్​ తరగతులు నిర్వహించనున్న నేపథ్యంలో మెదక్ జిల్లా ఇన్​చార్జ్​ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఈవో రమేశ్​ కుమార్, ఆయా శాఖల అధికారులతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. […]

Read More
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయండి

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయండి

సారథి న్యూస్, మెదక్: వానాకాలం వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలూ అందుకు అనుగుణంగా ముందుగానే ప్రణాళికలు సిద్ధంచేసుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. సోమవారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్​లో వర్షాలు ఎక్కువగా కురవడంతో జిల్లావ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో వరిని సాగుచేశారని వివరించారు. అంచనా ప్రకారం మూడున్నర లక్షల టన్నుల ధాన్యం పండుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, డీఆర్డీఏ, […]

Read More

నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యం

సారథిన్యూస్​, ఖమ్మం: రాష్ట్రంలోని నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాములు నాయక్​ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఖమ్మం టీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయంలో 25 మంది లబ్ధిదారులకు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను ఎమ్మెల్యే రాములు నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్​ఫెడ్​ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, టీఆర్​ఎస్​ జిల్లా ఇంచార్జి కృష్ణ టీఆర్​ఎస్​ నేతలు కోసూరి శ్రీనివాసరావు, పిచ్చయ్య, మధు, మాలోతు శకుంతల, సత్యనారాయణ, […]

Read More

అవగాహన లేకే ఆరోపణలు

సారథిన్యూస్, రామడుగు: మోతే రిజర్వాయర్​ నిర్మాణంపై అవగాహన లేకే కాంగ్రెస్​ నేతలు ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని సింగల్​విండో చైర్మన్​ వీర్ల వెంకటేశ్వర్​రావు విమర్శించారు. సోమవారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగులో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను విమర్శించే స్థాయి మేడిపల్లి సత్యానికి లేదని పేర్కొన్నారు. మోతే రిజర్వాయర్​ తూముల గురించి సరైన అవగాహన లేకుండా సత్యం నోటికొచ్చిన ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే సహించేది లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు గంట్లా […]

Read More
తెలంగాణ 2,924 కరోనా కేసులు

తెలంగాణలో 2,924 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో(24 గంటల్లో) ఆదివారం 2,924 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,23,090 పాజిటివ్​కేసుల నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 818 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ ​కేసులు 31,284 ఉన్నాయి. 24 గంటల్లో 61,148 శాంపిళ్ల టెస్టులు చేశారు. ఇప్పటివరకు 13,27,791 పరీక్షలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 461 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల […]

Read More
ధ్యాన్ చంద్ జీవితం.. అందరికీ ఆదర్శం

ధ్యాన్ చంద్ జీవితం.. అందరికీ ఆదర్శం

సారథి న్యూస్, హైదరాబాద్: జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం దివంగత మేజర్ ధ్యాన్ చంద్ 115వ జయంతిని పురస్కరించుకుని గచ్చిబౌలిలోని ఆయన విగ్రహానికి క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ లో భారత్ కు వరుసగా 1928, 1932, 1936లో పసిడి ఫలితాలు అందించి.. హాకీకి ధ్యాన్ చంద్​ స్వర్ణయుగం అందించారని కొనియాడారు. ఏటా ఆగస్టు 29న […]

Read More
గవర్నర్​తో సీఎం కేసీఆర్​భేటీ

గవర్నర్​తో సీఎం కేసీఆర్​ భేటీ

సారథి న్యూస్, హైదరాబాద్: గవర్నర్ తమిళ్​సై సౌందర్​రాజన్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు.. తదితర అంశాలపై గవర్నర్ తో చర్చించారు. అనంతరం తమిళ్​సై బాబాయ్ మృతిచెందడంతో ముఖ్యమంత్రి పరామర్శించారు. తమిళనాడులోని కన్యాకుమారి లోక్ సభ సభ్యుడు వసంత కుమార్ కరోనాతో ఇటీవల కన్నుమూసిన తెలిసిందే. వసంత కుమార్ ప్రస్తుతం తమిళనాడు […]

Read More