Breaking News

TELANGANA

కరోనాపై నిర్లక్ష్యం తగదు

సారథిన్యూస్​, మహబూబాబాద్​: ప్రైవేట్​ ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలను ఉచితంగా చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య డిమాండ్​ చేశారు. అవసరమైతే ప్రైవేట్​ ఆస్పత్రులను ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకోవాలని సూచించారు. కరోనా టెస్టుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. కరోనా టెస్టుల్లో ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం ఆయన మహబూబాబాద్​లోని పెరుమాండ్ల భవన్​లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటింటికి కరోనా టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. […]

Read More

గురుకులాల ప్రవేశ ఫలితాలు రిలీజ్​

సారథి న్యూస్​, మహబూబ్​నగర్​: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్మీడియట్​, ఒకేషనల్​ కళాశాలల్లో ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సంస్థ వెబ్​సైట్​ www.tswreis.ac.inలో అందుబాటులో ఉంచినట్టు గురుకులాల మహబూబ్​ నగర్​ రీజినల్​ కోఆర్డినేటర్​ ఫ్లారెన్స్​రాణి తెలిపారు. వీటితోపాటు 6 నుంచి 9 తరగతుల్లో బ్యాక్​లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్టు సోమవారం వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు ఆయా స్కూళ్ల ప్రిన్సిపాల్స్​ సమాచారం అందిస్తారని చెప్పారు. […]

Read More

5 జిల్లాలు.. 50వేల మందికి టెస్టులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించాలని నిర్ణయించినట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై సీఎం ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే వారం పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ […]

Read More

తెలంగాణలో బంగారం పండిచొచ్చు

సారథి న్యూస్​, సూర్యాపేట: తెలంగాణ భూముల్లో బంగారు పండుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ప్రపంచ దేశాలకు కావలసిన ఆహార ఉత్పత్తులను పండించగల సామర్థ్యం ఇక్కడి భూములకు ఉందన్నారు. ఇక మిగిలింది పంటకు గిట్టుబాటు ధర కల్పించడమేనని ఆయన​న్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రుణమేళా సదస్సులో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్​ రూపొందించిన నియంత్రిత సాగులో రైతులను సంఘటితం చేయడమేనని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్. […]

Read More
వినోద్​కుమార్​

విపత్తులోనూ ప్రగతే లక్ష్యం

సారథిన్యూస్​, హైదరాబాద్​: కరోనా విపత్తు పీడిస్తున్న ప్రస్తుత సమయంలోనూ ప్రగతి సాధించాలని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ పేర్కొన్నారు. పలు పరిశ్రమలు కరోనా సమయంలో తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయని చెప్పారు. లాభాలు సాధించేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇన్​‌స్టిట్యూట్​ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఇండియా) తెలంగాణా సెంటర్‌ ఆధ్వర్యంలో ‘ఖనిజ పరిశ్రమలపై కోవిడ్‌-19 ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన వెబ్‌నార్‌ లో ఆయన ప్రసంగించారు. ఖనిజ పరిశ్రమల ఇంజినీర్లు కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకొంటూ ఉత్పాదకత పెంచేందుకు […]

Read More

9 మంది మృత్యువాత

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. 24 గంటల్లో 9మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 174 కి చేరింది. శుక్రవారం ఒకేరోజు కొత్తగా 164 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో 133 కేసులు పాజిటివ్ గా తేలాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,484కు చేరింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఆరు చొప్పున, సంగారెడ్డి జిల్లాలో నాలుగు, నిజామాబాద్ జిల్లాలో మూడు, మహబూబ్​ నగర్​, కరీంనగర్​, ములుగు […]

Read More

వీఐపీల్లో కరోనా కలవరం

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు అందరినీ వైరస్ వణికిస్తోంది. రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తికి వైరస్ ప్రబలింది. దీంతో మేయర్ సహా వారి కుటుంబసభ్యులు, ఇతర అధికారులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా మంత్రి హరీశ్‌రావు పీఏకు కూడా కరోనా ప్రబలినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి హరీశ్ రావుతో పాటు కుటుంబసభ్యులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు సమాచారం. […]

Read More

‘తెలంగాణ తల్లి’ గీతం హత్తుకుంది

సారథి న్యూస్​, హైదరాబాద్​: ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి రచించిన తెలంగాణ తల్లి ప్రార్థనా గీతాన్ని మంత్రి కె.తారకరామారావు శుక్రవారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ‘తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక చరిత్ర సాహిత్యం, శిల్పకళ గురించి వర్ణించే ఈ పాట హత్తుకుందని’ తెలిపారు. మంత్రి చేతులమీదుగా విడుదల చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు.

Read More