న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏ రోజుకు ఆ రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 26,506 కేసులు నమోదయ్యాయని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ బులిటెన్ రిలీజ్ చేసింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7,93,802కు చేరింది. ఇప్పటి వరకు 475 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 21,604కు చేరింది. ఈ నెల 3నుంచి రోజుకు దాదాపు 20వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో దాదాపు […]
చెన్నై: తమిళనాడులోని ట్యుటికోరన్ జిల్లాలో జరిగిన తండ్రి కొడుకుల కస్టోడియల్ మరణాల కేసులో సీబీసీఐడీ పోలీసులు గురువారం మరో నలుగురు పోలీసులను అరెస్టు చేశారు. ఇన్ స్పెక్టర్ శ్రీధర్, మరో ముగ్గురినీ అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేశ్‌ను అరెస్టు చేయగా.. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులను అరెస్టు చేశారని తెలసిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున బయటికి వచ్చి సంబురాలు జరుపుకున్నారు. పటాకులు […]
చిత్తూరు: లారీ బోల్తాపడడంతో నలుగురు మృతిచెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గం పీటీయం మండలం కర్ణాటక సరిహద్దు ప్రాంతం చేలూరు వద్ద బుధవారం చోటుచేసుకుంది. కర్ణాటకలోని చేలూరు సమీపంలోని పాలసముద్రం వద్ద రైతు పొలంలో బోరు వేసేందుకు వెళ్తుండగా.. మార్గమధ్యంలో లారీ వేగం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బీ కన్నన్(69) అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవలే వైద్యులు శస్త్రచికిత్సచేశారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. శనివారం మధ్యాహ్నం ఆరోగ్యం విషమించి మృతి చెందారు. కన్నన్.. లెజండరీ డైరెక్టర్ భీమ్ సింగ్ కుమారుడు. ప్రముఖ ఎడిటర్ బీ లెనిన్ కు సోదరుడు. కన్నన్ తమిళంతో పాటు తెలుగు మలయాళ చిత్రాలకు కూడా కెమెరామెన్ గా పనిచేశారు. తమిళ […]