సారథి న్యూస్, శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం రాత్రి మల్లికార్జునస్వామి, భ్రమరాంబ దేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలనక్షత్రం రోజులలో సర్కారు సేవగా ఈ ఉత్సవాన్ని జరిపిస్తారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠిస్తారు. తర్వాత మహాగణపతిపూజ చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించారు. భౌతికదూరం పాటిస్తూ ఈ పల్లకీ ఉత్సవాన్ని అర్చకులు, వేదపండితులు నిర్వహించారని ఈవో […]
సారథి న్యూస్, అచ్చంపేట: తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీశైలం పాతాళగంగ ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బుధవారం మరోసారి మంటలు చెలరేగాయి. బతుకుజీవుడా అంటూ సిబ్బంది పరుగులు తీశారు. కరెంట్ కేబుల్ పైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సిబ్బంది చెప్పారు. అయితే ప్రమాద తీవ్రతను అధికారులు పరిశీలిస్తున్నారు. లాన్‌కు ఎలాంటి ప్రమాదం లేదని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనతో జెన్కో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హతాశులయ్యారు. పొగలు కమ్ముకుంటుండడంతో […]
సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారిని ఆంధ్రప్రదేశ్రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ఆదివారం దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపాసాగర్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్కె.ఫక్కీరప్ప, జేసీ రవి పట్టన్ శెట్టి, ఈవో రామారావు తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవారి మహామంగళ హారతి సేవలో పాల్గొన్నారు. అనంతరం వ్యూ పాయింట్‌నుంచి శ్రీశైలం జలాశయం, పరిసర ప్రకృతి అందాలను తిలకించారు. అక్కడే ఉన్న మ్యూజియంలోకి […]
సారథి న్యూస్, అచ్చంపేట: శ్రీశైలం పవర్ హౌస్‌లో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో మృత్యువాతపడిన తెలంగాణ జెన్కో ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ తోటి ఉద్యోగులు దోమలపెంట జెన్ కో కాలనీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో హైడల్ డైరెక్టర్ వెంకట్ రాజాం, సీఈ ప్రభాకర్ రావు, టీఆర్ వీకేఎస్నాయకులు రాఘవేంద్రరెడ్డి, సీఐటీయూ నాయకుడు సునిందర్, 327 యూనియన్నుంచి యాదయ్య, ఇంజినీరింగ్ అసోసియేషన్ నుంచి అనిల్, చరణ్, ఏఐటీయూసీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలోకి బయట నుంచి వాటర్ వచ్చే అవకాశమే లేదని జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఈనెల 20న వపర్హౌస్లో జరిగిన ప్రమాదంపై విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు ఇంజనీర్లు, ఇద్దరు ఒక బ్యాటరీ కంపెనీ ప్రతినిధులు మరణించడం చాలా బాధాకరమన్నారు. అగ్నిప్రమాదం సమయంలో యూనిట్స్ ట్రిప్ కావలసి ఉంటుంది.. కానీ ఎందుకు ఆటోమేటిక్ గా ట్రిప్ కాలేదో విచారణ […]
సారథి న్యూస్, నాగార్జునసాగర్: కృష్ణానది పరవళ్లు తొక్కుతుంది. వరద ఉధృతి కొనసాగుతుండడంతో శ్రీశైలం గేట్లను ఎత్తి నాగార్జునసాగర్డ్యాంకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్14 గేట్లను ఎత్తి 3,28,440 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 587.3 అడుగుల మేర ఉంది. 3,28,440 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రిజర్వాయర్‌లోకి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటినిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 305.6838 టీఎంసీలు ఉంది. నాగార్జున […]
సారథి న్యూస్, పాల్వంచ: శ్రీశైలం ఎడమ గట్టు పవర్‌హౌస్ ప్రమాదంలో మృతిచెందిన విద్యుత్‌శాఖ ఉద్యోగుల బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) డిమాండ్ చేశారు. ఇటీవల పవర్ హౌస్‌లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన పాల్వంచ ఇందిరా నగర్ కాలనీకి చెందిన జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ కుమార్ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబసభ్యులను ఆదివారం పరామర్శించారు. కేంద్ర […]
పాలనలో తప్పులు ఎత్తిచూపే వారిని వేధిస్తున్నారు పవర్‌హౌస్ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రేవంత్ రెడ్డి లేఖ హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కు శనివారం లేఖ రాశారు. ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రజలకు గవర్నర్ హోదాలో మీరు ఇటీవల స్పందించిన తీరు కొంత ఊరట కలిగించిందన్నారు. లేఖలోని ముఖ్యాంశాలు.. ‘రాష్ట్రంలో రాజ్యాంగ, పౌర, […]