గంట గంటకు పోటెత్తుతున్న వరద 4.75 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల జూరాల 45 గేట్ల ఎత్తివేత సారథి, జూరాల(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లాలోని కృష్ణానదికి వరద ప్రవాహం గంట గంటకు ఉధృతంగా పెరుగుతోంది. దిగువన శ్రీశైలం వైపునకు ఉరకలేస్తోంది. జూరాల ప్రాజెక్టు 45 గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే బీచుపల్లి వద్ద పుష్కరఘాట్లను ముంచెత్తింది. ఎగువ నుంచి నీటి విడుదల పెరిగితే ఆలయాన్ని వరద తాకనుంది. ఈ […]
సారథి న్యూస్, కర్నూలు: భారీవరద రావడంతో శ్రీశైలం రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. అధికారులు గురువారం ఐదుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 885 అడుగులకు గాను 880 అడుగుల మేర నీటినిల్వ ఉంది. రిజర్వాయర్ సామర్థ్యం 215. 807 టీఎంసీలు కాగా, 196 టీఎంసీల నీటినిల్వ ఉంది. జూరాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది.
సారథి న్యూస్, అచ్చంపేట: కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే ఘాట్రోడ్డులో నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు సమీపంలోని దర్గా వద్ద రక్షణగోడ శనివారం కూలింది. సమాచారం అందుకున్న అమ్రాబాద్ పోలీసులు శ్రీశైలం మార్గంలో వాహనాల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేశారు. నాలుగైదు రోజులుగా నల్లమల అటవీప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాన నీటికి రక్షణ గోడ కోతకు గురైందని భావిస్తున్నారు. శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో కరోనా కలకలం సృష్టించగా, భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. […]