Breaking News

SRIKAKULAM

వంగపండు ఇకలేరు

ప్రజాగొంతుక మూగబోయింది

సారథి న్యూస్​, శ్రీకాకుళం: ప్రజాగొంతుక మూగబోయింది. తన పాటలతో ఇరు రాష్ట్రాల ప్రజలను విప్లవోన్ముఖులను చేసిన ఓ తార నింగికెగిసింది. ప్రజాగాయకుడు, విప్లవకవి, ప్రజావాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు (77) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని స్వగ్రామంలో ఆయన తుదిశ్వాస విడిచారు. వంగపండు ప్రసాదరావు 1943లో పార్వతీపురం సమీపంలోని పెదబొండపల్లి గ్రామంలో జన్మించారు. జగన్నాథం, చినతల్లి ఆయన తల్లిదండ్రులు. 1970లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన గిరిజనుల ఉద్యమంలో ఆయన పాట తొలిసారి ప్రాచుర్యం పొందింది. […]

Read More

ఆ స్ఫూర్తితోనే విలేకరి అయ్యా

గిరిజనుల స్థితిగతులపై రాసిన కథనాలు సీఎంనే కదిలించాయ్​ జర్నటిస్టులకు వృత్తిపట్ల శ్రద్ధ, పరిస్థితులపై క్షుణ్ణత ఉండాలి మాతృభాష మన మన అస్తిత్వం.. మనమే బతికించుకోవాలి సీనియర్​ పాత్రికేయులు పట్నాయకుని వెంకటేశ్వరరావు సారథి ‘జర్నలిస్టు’తో ముఖాముఖి ‘అది 2001.. పదిరోజుల పాటు జోరువానలు.. భువనేశ్వర్‌లో భీకర పరిస్థితి, తాటిచెట్టు ఎత్తంత ప్రవహించే వరద.. ఒక్కసారి మా ప్రాణాలు పోయినంత పనైంది. అయినా కూడా సైన్యానికి చెందిన బోట్లలో వెళ్లి కథనాలు రూపొందించాం.’ అని సీనియర్​ జర్నలిస్ట్, కవి, రచయిత, […]

Read More

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి

సారథి న్యూస్​, శ్రీకాకుళం: జిల్లాలో మోడల్ ప్రాజెక్టును పక్కాగా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్​ వ్యవసాయశాఖ కమిషనర్​ హనుమంతు అరుణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం శ్రీకాకుళం కలెక్టరేట్​లో ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రాజెక్టు పథకం అమలుపై వ్యవసాయ, అనుబంధ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ఆదర్శ రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. రైతులు అధికాదాయం పొందాలని, ముఖ్యంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం […]

Read More

అచ్చెన్నాయుడు అరెస్ట్

సారథి న్యూస్​, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్​ మాజీమంత్రి, శాసనసభ ప్రతిపక్ష ఉపనేత, టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో శుక్రవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వేకువజామునే గ్రామానికి విజయవాడ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చారు. ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక బస్సులో విజయవాడకు తరలించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయనపై ఈఎస్​ఐ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు ఉన్నాయి. అచ్చెన్నాయుడి అరెస్ట్​ నేపథ్యంలో […]

Read More
SPEAKER

ఏపీలో సాగుకు పెద్దపీట

సారథిన్యూస్​, శ్రీకాకుళం: వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఏపీ స్పీకర్​ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాండ్యాం గ్రామ సమీపంలోని రెల్లి గెడ్డపై రూ.26.42 కోట్లతో నిర్మించే ఎత్తిపోతల పథకానికి శాసన సభాపతి తమ్మినేని గురువారం శంకుస్దాపన చేశారు. ప్రతి గడపకు పరిపాలన చేరవేయడమే సీఎం జగన్​ ఆలోచన అన్నారు. తాండ్యాం ఎత్తిపోతల పథకాన్ని రూ.26.42 కోట్లతో నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా తాండ్యాం, పొందూరు, కృష్ణాపురం, మాల్కం గ్రామాలకు చెందిన […]

Read More

ఇసుక డోర్ డెలివరీ

సారథి న్యూస్​, శ్రీకాకుళం: జిల్లాలో ఇసుక డోర్ డెలివరీ మరింత పెరగాలని శ్రీకాకులం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. 60 శాతం మేర ఇసుక డోర్ డెలివరీకి కేటాయించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో ఇసుక సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ విధానాన్ని సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని వివరించారు. జేసీ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో 23 రీచ్ లలో 12 రీచ్ లు పనిచేస్తున్నాయని, ఆరు రీచ్ లలో ఇసుక నిల్వలు అధికంగా […]

Read More

మోగనున్న గుడిగంట

సారథి న్యూస్, శ్రీకాకుళం, విజయనగరం: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండున్నర నెలల తర్వాత గుడి తలుపులు తెరుచుకోనున్నాయి.. రెండురోజుల పాటు ప్రయోగాత్మకంగా ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత, ఆధార్​, సెల్​ నంబర్​ తదితర వివరాలను పరిశీలించి భక్తులను అనుమతించనున్నారు.. దేవాదాయశాఖ శ్రీకాకుళం జిల్లా సహాయ కమిషనర్​ వై.భద్రాజీ శనివారం మార్గదర్శకాలు జారీచేశారు. భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్​లు చేయాలని సూచించారు. భక్తులు కాళ్లు, చేతులు కడుక్కోవడానికి బక్కెట్లతో నీళ్లు, మగ్గులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. జూన్​ 8, 9వ […]

Read More

‘నాడు నేడు’ పనులు పూర్తిచేయాలి

సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ స్కూళ్లలో చేపడుతున్న ‘నాడు నేడు’ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. కల్లేపల్లి ప్రైమరీ స్కూలులో రూ.18.25 లక్షల వ్యయంతో చేపట్టిన పనులను శనివారం ఆయన పరిశీలించారు. పనులు నాణ్యవంతంగా ఉండాలని సూచించారు.

Read More