Breaking News

SEETHAKKA

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే సీతక్క విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు నల్లెల కుమారస్వామి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, సాంబయ్య, రమణా కర్, అజ్జు తదితరులు పాల్గొన్నారు.

Read More

మొక్కలు నాటిన సీతక్క

సారథిన్యూస్​, ములుగు: మొక్కలతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. బుధవారం ఆమె ములుగు జిల్లాలోని తన జగ్గన్నపేటలో తల్లిదండ్రులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో వెంకన్న, రామచందర్​, ముతయ్య భూషన్​ తదితరులు పాల్గొన్నారు.

Read More
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్కకు వినతిపత్రమిస్తున్న ప్రైవట్​ టీచర్లు

కష్టాల్లో ప్రైవేట్​ టీచర్లు

సారథి న్యూస్, ములుగు: లాక్​డౌన్​తో ప్రైవేట్​ స్కూల్​ టీచర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారని.. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం నాయకులు సోమవారం ములుగులో ఎమ్మెల్యే సీతక్కకు వినతిపత్రమిచ్చారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రైవేట్​ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నల్లెల కుమారస్వామి, ఆక రాధాకృష్ణ, మైల జయరాం రెడ్డి, నమాకరం చంద్ బానోతు రవి చందర్, మామిడి శెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు.

Read More