Breaking News

SANTOSHBABU

అమరజవాన్​కు ఆత్మీయనివాళి

సారథి న్యూస్, రామడుగు: చైనా సరిహద్దులో శత్రు మూకల దాడిలో అమరుడైన తెలంగాణ కు చెందిన వీర జవాన్ సంతోష్ బాబు కు కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం శానగర్​లో సోమవారం నివాళి అర్పించారు. సంతోష్​బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి.. అతడి సేవలను కొనియాడారు. ప్రతి ఇంట్లోనూ ఓ సంతోష్​బాబు తయారు కావాలని ఆకాంక్షించారు

Read More

సంతోష్ బాబు ఇంటికి నేనే వెళ్తా

సారథిన్యూస్​, హైదరాబాద్​: కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రూ.5 కోట్ల నగదు, నివాస స్థలం, సంతోష్​ బాబు భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానీ మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో సీఎం కేసీఆర్​ మాట్లాడుతూ.. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా […]

Read More
కల్నల్​ సంతోష్​బాబు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి జగదీశ్​రెడ్డి తదితరులు

సంతోష్​బాబుకు కన్నీటి వీడ్కోలు

సారథిన్యూస్​, సూర్యాపేట: భారత్​​​-చైనా సరిహద్దులో మాతృభూమి కోసం ప్రాణలర్పించిన సంతోష్​బాబుకు యావత్​ భారతావని కన్నీటి వీడ్కోలు పలికింది. సూర్యాపేట సమీపంలోని కేసారంలో సైనికలాంచనాల నడుమ సంతోష్​​బాబుకు అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. ఆర్మీ జవాన్లు వీరజవానుకు నివాళిగా మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. తండ్రి సురేశ్​బాబు చితికి నిప్పంటించారు. రాష్ట్ర మంత్రి జగదీశ్​రెడ్డి సంతోష్​బాబు పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు.

Read More

ప్రధానకూడలికి సంతోష్ బాబు​ పేరు

సారథిన్యూస్​, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలికి అమరజవాన్​ కల్నల్​ సంతోష్​బాబు పేరు పెడతామని రాష్ట్ర మంత్రి జగదీశ్​రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట సమీపంలోని కేసారంలో నిర్వహించిన కల్నల్​ సంతోష్​బాబు అంత్యక్రియల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగదీశ్​రెడ్డి ప్రతినిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసారం గ్రామాన్ని కల్నల్​ సంతోష్​బాబు జ్ఞాపక చిహ్నంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం తరఫున అన్నివిధాలా సాయం చేస్తామని చెప్పారు. చైనా సైన్యాన్ని తరిమికొట్టడంతో కల్నల్ […]

Read More

రేపు కల్నల్​ సంతోష్​​ అంత్యక్రియలు

భారత్, చైనా సైనికుల ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌ పార్థివదేహాన్ని లేహ్ నుంచి ప్రత్యేక విమానంలో తరలించారు. ఆయన మృతదేహం హకీంపేటకు చేరుకోనున్నది. సంతోష్‌బాబు కుటుంబ సభ్యులు కూడా ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. గురువారం అంత్యక్రియలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు జరపాలని ఆర్మీ అధికారులు పట్టుపడుతున్నారు. కరోనా కారణంగా సంతోష్‌బాబు మృతదేహాన్ని సూర్యాపేటకు తరలించడం సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు. కుటుంబసభ్యులు ఇష్టప్రకారమే అంత్యక్రియలు చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంతోష్‌బాబు కుటుంబసభ్యులు […]

Read More