Breaking News

SANTOSH

ఎంపీ సంతోష్ కు అరుదైన గిఫ్ట్

ఎంపీ సంతోష్ ​కు అరుదైన గిఫ్ట్​

న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఎంపీలు కేక్ ​కట్ ​చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ లో భాగంగా మొక్కనాటారు. రాజ్యసభ ఎంపీలు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, కేఆర్ సురేష్ రెడ్డి, పార్లమెంట్ ​ఎంపీలు నామా నాగేశ్వరరావు, గడ్డం రంజిత్ రెడ్డి, పోతుగంటి రాములు, బోర్లకుంట్ల వెంకటేష్ నేత, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
కల్నల్​ కుటుంబానికి బంజారాహిల్స్​లో ఇంటిస్థలం

కల్నల్​ కుటుంబానికి బంజారాహిల్స్​లో స్థలం

సారథి న్యూస్, హైదరాబాద్: చైనా సరిహద్దులో పోరాడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల చెక్కు రూపంలో నగదు అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇంటి స్థలం కూడా అందించబోతోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా రూ.20 కోట్ల విలువైన 711 గజాల స్థలాన్ని కేటాయించింది. మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా ఈ స్థలాన్ని సంతోష్ బాబు కుటుంబానికి అప్పగించనుంది. […]

Read More

సంతోష్​ త్యాగం మరువలేనిది

సారథిన్యూస్​, ఖమ్మం: భారత్​-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన కల్నల్​ సంతోష్​బాబు త్యాగం మరువలేనిదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఖమ్మం జెడ్పీ సమావేశమందిరంలో సంతోష్​బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అజయ్​ మాట్లాడుతూ.. సంతోష్​బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More