సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ సాగును ప్రోత్సహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. రాష్ట్రానికి కాళేశ్వరం జలాలు పుష్కలంగా వస్తున్నాయని.. ఖమ్మం జిల్లాకు వరప్రదాయిని అయిన సీతారామ ప్రాజెక్టు జలాలు కూడా త్వరలోనే వస్తాయని అందువల్ల ప్రభుత్వం పామాయిల్ సాగును ప్రోత్సహిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని రైతులు లాభపడతారని పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. పామాయిల్ మొక్కల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహకం అందించాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా ఫ్యాక్టరీలు కూడా […]
సారథి న్యూస్, సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుందని, అందువల్ల ఇక్కడ కొత్త ఆస్పత్రిని కట్టాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ మేరకు ఆయన ఖమ్మం వచ్చిన ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌కు వినతిపత్రం ఇచ్చారు. 1970లో ఈ ఆస్పత్రిని అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి హయాంలో కట్టారని వివరించారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
సారథి న్యూస్, ఖమ్మం: భారత్-చైనా సరిహద్దులో గల గాల్వన్ లోయలో ఇరుదేశాల సైనికుల ఘర్షణలో వీరమరణం చెందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి కల్నల్ సంతోష్ బాబుకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గురువారం సత్తుపల్లిలో కొవ్వొత్తిని వెలిగించి నివాళులు అర్పించారు. వీర మరణం చెందిన సంతోష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.