పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘వకీల్‌సాబ్’ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. బుధవారం ఉదయం 9.09 నిమిషాలకు ఈ మోషన్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లో పవన్‌కల్యాణ్.. నల్లకోటు, చేతిలో లా బుక్, మరో చేతిలో కర్రపట్టుకొని కనబడుతున్నాడు. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నది. వకీల్ సాబ్ చిత్రం హిందీ సినిమా ‘పింక్’ కు రీమేక్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్యలు హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణుశ్రీరామ్ దర్వకత్వం […]
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారు చేసినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అంతర్జాతీయ నిపుణులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగ పరీక్షలు ఫలితాల సమాచారాన్ని ఎక్కడా వెల్లడించకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం రెండు నెలల ప్రయోగాల అనంతరం వ్యాక్సిన్ ఆమోదాన్ని ప్రకటించడంపై పెదవివిరుస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌ను నమ్మడం కష్టమని బ్రిటన్, జర్మనీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలుకంపెనీలు భారీస్థాయిలో పరిశోధనలు చేపట్టాయి. ఇప్పటికే […]
‘మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ‘సర్కార్‌వారిపాట’ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్లో మహేశ్‌బాబు చేతితో రూపాయి కాయిన్‌ను ఎగరవేస్తూ కనిపిస్తున్నాడు. కేవలం మహేశ్‌బాబు చెయ్యి మాత్రమే కనిపిస్తున్నది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాయి. కాగా మోషన్ పోస్టర్ చూసి ఫ్యాన్స్ కొంత నిరాశచెందినట్టు సమాచారం. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. సోషల్ మీడియాలో మహేశ్‌కు […]
సారథిన్యూస్, రామగుండం: విరసం నేత, విప్లవకవి, రచయిత వరవరరావును వెంటనే విడుదల చేయాలని పలువురు ప్రజాసంఘాలు, దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వృద్ధుడైన వరవరరావును ప్రధాని హత్యకు కుట్రపన్నాడంటూ అరెస్ట్ చేయడం సరికాదని పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆల్ఇండియా అంబేద్కర్ యువనజనం సంఘం నేతలు వివిధ సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరు మధు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మల్లారెడ్డి, […]
సారథి న్యూస్, రామాయంపేట: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని నిజాంపేట ఎంపీపీ సిద్దరాములు పేర్కొన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామానికి చెందిన నీలం నర్సయ్య ఇటీవల అనారోగ్యానికి గురికాగా అతడికి రూ. 60 వేల సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కును అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయరాం, ఎంపీటీసీ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, గోదావరిఖని: బొగ్గును విక్రయించేందుకు సింగరేణి సంస్థ ప్రత్యేకపోర్టల్ను ప్రారంభించింది. విదేశీ బొగ్గు దిగుమతికి బదులుగా స్వదేశీ బొగ్గు వినియోగం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు అధికారిక వెబ్సైట్లో ఓ ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించినట్టు సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్, ప్రాజెక్ట్స్) భాస్కర్‌రావు, ఆపరేషన్స్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ పోర్టల్ కు సంబంధించిన వివరాల కోసం www.scclmines.com వెబ్‌సైట్‌ను కానీ 040-23142219 నంబర్ లో కానీ సంప్రదించాలని కోరారు. సింగరేణి సంస్థ వినియోగదారుల అభీష్టం మేరకు […]