సారథి న్యూస్, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలోని రెడ్డి సంఘం భవన్ లో గురువారం ఆటో యూనియన్ ఏర్పాటుచేసిన సంఘీభావ సభలో మంత్రి టి.హరీశ్‌రావు మాట్లాడారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడం బాధాకరన్నారు. తెలంగాణ మొత్తం ఇప్పుడు దుబ్బాక వైపు చూస్తోందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తాను, కాబోయే ఎమ్మెల్యే సుజాతక్క ప్రజల వైపే ఉంటామన్నారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడడం పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి తగదన్నారు. భేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. […]
తమకు ఎదురులేదనే ధీమాతో టీఆర్‌ఎస్ ‘ట్రబుల్ షూటర్’ దుబ్బాక బాధ్యతలు తీర్మానాల వ్యూహానికి మరింత పదును ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం డాక్టర్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి నేటి దాకా ఉపఎన్నికల పార్టీగా టీఆర్‌ఎస్ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటోంది. ఆయా ఎన్నికల్లో భారీ మెజారిటీలే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోవడం దానికి ఆనవాయితీ. అది పార్లమెంట్ సీటైనా, అసెంబ్లీ స్థానమైనా.. పక్కా ప్లాన్ ప్రకారం సమావేశాలు, సభలు నిర్వహించడం ద్వారా ఓటర్లను కొన్ని నెలల ముందే కలవడం, […]
సారథి న్యూస్, హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై టీఆర్‌ఎస్ దృష్టి సారించింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోటీచేసేందుకు దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు దాదాపు ఖరారు చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత లేదా కుమారుడు సతీష్‌రెడ్డికి టికెట్ దక్కడం దాదాపు ఖాయమనే […]
సారథి న్యూస్, సిద్దిపేట: దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి టి.హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన లేకుండా ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి వస్తుందని అనుకోలేదని విచారం వ్యక్తంచేశారు. గురువారం దుబ్బాక అసెంబ్లీ నియోజవర్గంలోని దౌల్తాబాద్ వీటీటీ ఫంక్షన్ హాల్ లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అంతుకుముందు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి […]
సారథి న్యూస్, సిద్దిపేట: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భౌతిక కాయానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామలింగారెడ్డి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
సారథి న్యూస్, మెదక్, సిద్దిపేట: ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచిన జర్నలిస్ట్… అణగారిన వర్గాల హక్కుల సాధనకు పోరాడిన ఉద్యమ వీరుడు.. ఎమ్మెల్యేగా నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసిన ప్రజాప్రతినిధి సోలిపేట రామలింగారెడ్డి. అనారోగ్యంతో గురువారం మృతి చెందిన రామలింగారెడ్డి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో 1961 అక్టోబర్ 2 వ తేదీన సోలిపేట రామక్రిష్ణారెడ్డి, మాణిక్యమ్మ దంపతులకు జన్మించాడు. ఆయనకు ఇద్దరు అన్నలు రాంచంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి… ముగ్గురు అక్కలు లక్ష్మి, విజయలక్ష్మి, […]
సారథి న్యూస్, సిద్దిపేట: అనారోగ్యంతో మృతిచెందిన సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే, అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మంత్రి హరీశ్ రావు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.